IND vs ENG: బాబులూ భయపడ్డారా.. బజ్‌బాల్ ఎక్కడ..? టుక్ టుక్.. ఏందీఆట..! ఇంగ్లాండ్ బ్యాటర్లను ఓ ఆటాడుకున్న సిరాజ్, గిల్.. వీడియోలు వైరల్

2022లో మెక్‌కలమ్ కోచ్‌గా బాధ్యతలు స్వీకరించాక ఇంగ్లాండ్ మొదట బ్యాటింగ్ చేసిన 17 సందర్భాల్లో తొలి సెషన్లో ఆ జట్టు అతి తక్కువ రన్‌రేట్ ఇదే కావడం గమనార్హం.

IND vs ENG: బాబులూ భయపడ్డారా.. బజ్‌బాల్ ఎక్కడ..? టుక్ టుక్.. ఏందీఆట..! ఇంగ్లాండ్ బ్యాటర్లను ఓ ఆటాడుకున్న సిరాజ్, గిల్.. వీడియోలు వైరల్

IND vs ENG 3rd Test

Updated On : July 11, 2025 / 8:05 AM IST

IND vs ENG 3rd Test: భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భాగంగా మూడో మ్యాచ్ గురువారం లార్డ్స్ మైదానంలో ప్రారంభమైంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ జట్టు.. ‘బజ్‌బాల్’ క్రికెట్‌తో పరుగుల వరద పారిస్తుందని అందరూ అంచనా వేశారు. కానీ, ఇంగ్లాండ్ బ్యాటర్లు బజ్‌బాల్ ఆటతీరును పక్కనపెట్టి.. కేవలం క్రీజులో నిలదొక్కుకునేందుకే ప్రాధాన్యతనిచ్చారు. దీంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్లు కోల్పోయి 251 పరుగులు మాత్రమే ఇంగ్లాండ్ జట్టు చేయగలిగింది.

Also Read: IND vs ENG: రా..రా.. పరుగు తీసుకో..! జోరూట్‌ను ఆటాడుకున్న జడేజా.. అయ్యో.. సెంచరీ చెయ్యనీలే.. ఫన్నీ వీడియో వైరల్

సాధారణంగా దూకుడైన ఆటతో పరుగులు రాబట్టే ఇంగ్లాండ్ జట్టు తొలిరోజు (గురువారం) 3.32 రన్‌రేట్‌తో మాత్రమే పరుగులు చేయగలిగింది. 2022లో మెక్‌కలమ్ కోచ్‌గా బాధ్యతలు స్వీకరించాక ఇంగ్లాండ్ మొదట బ్యాటింగ్ చేసిన 17 సందర్భాల్లో తొలి సెషన్లో ఆ జట్టు అతి తక్కువ రన్‌రేట్ ఇదే కావడం గమనార్హం. దీంతో భారత ఆటగాళ్లు ఇంగ్లాండ్ బ్యాటర్లను కవ్వించే ప్రయత్నం చేశారు. టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తోపాటు మహమ్మద్ సిరాజ్ వారిని చిన్నపాటి ర్యాగింగ్ చేశారు.

జిడ్డు బ్యాటింగ్ ఎంత సేపు.. బజ్‌బాల్ ఎక్కడ..? అంటూ స్లెడ్జింగ్‌కు దిగారు. ‘టుక్ టుక్ మంటూ ఏమిటి ఈ ఆట.. ఇక ఆసక్తికరమైన క్రికెట్ ఉండదు.. వెల్‌కమ్ బ్యాక్‌ టు బోరింగ్ టెస్ట్ క్రికెట్’ అంటూ ఇంగ్లాండ్ బ్యాటర్లను ఉద్దేశిస్తూ గిల్ వ్యంగ్యంగా చేసిన కామెంట్స్ స్టంప్ మైక్‌లో రికార్డ్ అయ్యాయి. ఇక సిరాజ్ సంగతి చెప్పాల్సిన పనిలేదు. మామూలు సమయాల్లోనే బ్యాటర్లను రెచ్చగొట్టే ప్రయత్నం చేసే సిరాజ్.. తొలిరోజు ఇంగ్లాండ్ బ్యాటర్లు జిడ్డు బ్యాటింగ్‌తో విసిగిపోయాడు. దీంతో నోటికి పని చెప్పాడు.


సిరాజ్ బౌలింగ్ సమయంలో జో రూట్ క్రీజులో ఉన్నాడు. దీంతో బాల్ వేసిన తరువాత సిరాజ్ తన నోటికి పనిచెప్పాడు. ‘రూట్.. బజ్‌బాల్ ఎక్కడ..? ఇటు చూడు.. బజ్ బజ్ బజ్‌బాల్.. నేను బజ్‌బాల్ చూడాలి..’ అంటూ జోరూట్‌ను రెచ్చగొట్టేందుకు ప్రయత్నించాడు. ఇలా పలుసార్లు టీమిండియా క్రికెటర్లు బజ్ బాల్ ఎక్కడ అంటూ కామెంట్స్ చేసినప్పటికీ ఇంగ్లాండ్ బ్యాటర్లు మాత్రం పరుగుల కోసం దూకుడుగా ఆడటం కంటే.. జిడ్డు బ్యాటింగ్‌తో క్రీజులో పాతుకుపోవటానికే ఎక్కువ ప్రాధాన్యతనిచ్చారు.