India vs England 4th T20I : ఇంగ్లండ్ పై భారత్ ఘన విజయం, సిరీస్ కైవసం

తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది.

India Won (Photo Credit : Twitter)

India vs England 4th T20I : ఇంగ్లండ్ తో జరిగిన నాల్గోవ టీ20 మ్యాచ్ లో భారత్ ఘన విజయం సాధించింది. ఉత్కంఠ భరితంగా జరిగిన మ్యాచ్ లో ఇంగ్లండ్ ను చిత్తు చేసింది. 15 పరుగుల తేడాతో భారత్ గెలుపొంది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. 182 పరుగుల టార్గెట్ తో బరిలోకి ఇంగ్లండ్ 19.4 ఓవర్లలో 166 పరుగులు మాత్రమే చేసింది. ఇంగ్లండ్ బ్యాటర్లలో హ్యారీ బ్రూక్ హాఫ్ సెంచరీతో ఒంటరి పోరాటం చేశాడు. బ్రూక్ 26 బంతుల్లోనే 51 పరుగులు చేశాడు. బెన్ డకెట్ 39 పరుగులు, ఫిల్ సాల్ట్ 23 రన్స్ చేశారు.

ఒక దశలో ఇంగ్లండ్ కే గెలుపు అవకాశాలు కనిపించాయి. అయితే, 15వ ఓవర్ లో వరుణ్ చక్రవర్తి మ్యాజిక్ చేశాడు. 2 వికెట్లు తీసి మ్యాచ్ ని మలుపు తిప్పాడు. ఇక దూబెకు కంకషన్ సబ్ స్టిట్యూట్ గా వచ్చిన హర్షిత్ రాణా 3 వికెట్లు తీసి టీమిండియా విక్టరీలో కీ రోల్ ప్లే చేశాడు. అటు రవి బిష్ణోయ్ కూడా 3 వికెట్లతో రాణించాడు. అర్ష్ దీప్ సింగ్, అక్షర్ పటేల్ చెరో వికెట్ తీశారు.

Also Read : అరె బాప్‌రే.. కోహ్లీ రంజీ రీ ఎంట్రీని పీడ‌క‌లగా మార్చిన హిమాన్షు సాంగ్వాన్ ఎవ‌రో తెలుసా? ధోని లాగే ఇత‌డు కూడా..

అంత‌క‌ముందు తొలుత బ్యాటింగ్ చేసిన భార‌త్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 9 వికెట్ల న‌ష్టానికి 181 ప‌రుగులు చేసింది. భార‌త బ్యాట‌ర్ల‌లో హార్దిక్ పాండ్యా (53; 30 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స‌ర్లు), శివమ్ దూబె (53; 34 బంతుల్లో 7 ఫోర్లు, 2సిక్స‌ర్లు) లు హాఫ్ సెంచ‌రీలు చేశారు. రింకూ సింగ్ (30; 26 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌), అభిషేక్ శ‌ర్మ (29; 19 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌)లు రాణించారు.

Also Read : ఇండియన్ ప్లేయర్ల విషయంలో పాక్ క్రికెటర్లకు మాజీ కెప్టెన్ వార్నింగ్

సంజూ శాంస‌న్ (1), తిల‌క్ వ‌ర్మ (0), సూర్య‌కుమార్ యాద‌వ్ (0), అక్ష‌ర్ ప‌టేల్ (5)లు విప‌లం అయ్యారు. ఇంగ్లాండ్ బౌల‌ర్ల‌లో సాకిబ్ మహమూద్ మూడు వికెట్లు, జామీ ఓవర్టన్ రెండు వికెట్లు, బ్రైడన్ కార్సే, ఆదిల్ రషీద్ చెరో వికెట్ తీశారు. 4వ టీ20లో గెలిచిన భారత్.. 3-1 తేడాతో టీ20 సిరీస్ ను కైవసం చేసుకుంది.