IndvsEng 5thTest : 284 పరుగులకు ఇంగ్లండ్ ఆలౌట్.. భారత్‌కు భారీ లీడ్

భారత్, ఇంగ్లండ్ మధ్య బర్మింగ్ హామ్ లో జరుగుతున్న 5వ టెస్ట్ మ్యాచ్ ఆసక్తికరంగా సాగుతోంది. భారత బౌలర్లు రాణించారు. ఇంగ్లండ్ బ్యాటర్లను కట్టడి చేశారు. దీంతో ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌ లో 284 పరుగులకు ఆలౌట్ అయ్యింది. (IndvsEng 5thTest)

IndvsEng 5thTest : భారత్, ఇంగ్లండ్ మధ్య బర్మింగ్ హామ్ లో జరుగుతున్న 5వ టెస్ట్ మ్యాచ్ ఆసక్తికరంగా సాగుతోంది. భారత బౌలర్లు రాణించారు. ఇంగ్లండ్ బ్యాటర్లను కట్టడి చేశారు. దీంతో ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌ లో 284 పరుగులకు ఆలౌట్ అయ్యింది.

Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw

ఇంగ్లండ్ బ్యాటర్లలో జానీ బెయిర్‌ స్టో (106) సెంచరీతో రాణించాడు. బెయిర్ స్టో 140 బంతుల్లో 106 పరుగులు చేశాడు. అతడి స్కోర్ లో 14 ఫోర్లు, 2 సిక్సులు ఉన్నాయి. కెప్టెన్‌ బెన్‌స్టోక్స్‌ (25), సామ్‌ బిల్లింగ్స్‌ (36) పరుగులు చేశారు. వారిద్దరితో బెయిర్‌స్టో ఆరు, ఏడు వికెట్లకు 66, 92 పరుగుల విలువైన భాగస్వామ్యాలు నిర్మించాడు. చివర్లో మాటీ పాట్స్‌ (19) వేగంగా పరుగులు రాబట్టాడు.

Rishabh Pant: ఇండియా బెస్ట్ వికెట్ కీపర్ – బ్యాటర్ రిషబ్ పంతేనట

భారత బౌలర్లలో సిరాజ్‌ 4 వికెట్లు తీశాడు. బుమ్రా 3 వికెట్లు పడగొట్టాడు. షమీ రెండు వికెట్లు, శార్దూల్‌ ఠాకూర్ ఒక వికెట్‌ తీశారు. టీమిండియాకు 132 పరుగుల ఆధిక్యం దక్కింది.

Jasprit Bumrah: బ్రియాన్ లారా వరల్డ్ రికార్డ్ బ్రేక్ చేసిన బుమ్రా

84/5తో ఆదివారం మూడోరోజు ఆట కొనసాగించిన బెయిర్‌స్టో, బెన్‌స్టోక్స్‌ ఆచితూచి ఆడారు. తొలుత నెమ్మదిగా ఆడి ఇన్నింగ్స్‌ చక్కదిద్దే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే భారత బౌలర్ల సహనాన్ని పరీక్షించారు. అయితే, శార్దూల్‌ వేసిన 38వ ఓవర్‌లో స్టోక్స్‌ బౌండరీ కొట్టబోయి.. బుమ్రా చేతికి చిక్కాడు. తర్వాత బెయిర్‌స్టో.. బిల్లింగ్స్‌తో కలిసి ధనాధన్‌ బ్యాటింగ్‌ చేశాడు. ఈ క్రమంలోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కాసేపటికే షమీ బౌలింగ్‌లో స్లిప్‌లో కోహ్లీ చేతికి చిక్కాడు.(IndvsEng 5thTest)

కాగా, టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో 416 పరుగులకు ఆలౌట్ అయ్యింది. రిషబ్ పంత్, రవీంద్ర జడేజా సెంచరీలతో కదంతొక్కారు. తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 98 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. అలాంటిది చివరికి 416 పరుగులు చేస్తుందని ఎవరూ ఊహించలేదు. జడేజా క్రీజులోకి రాకముందు.. వచ్చాక అదీ పరిస్థితి. టాప్‌ఆర్డర్‌ మొత్తం విఫలమైనా లోయర్‌ ఆర్డర్‌లో మిగిలిన బ్యాట్స్‌మెన్‌తో కలిసి సుమారు 300 పరుగులు జోడించాడు. దీన్ని బట్టే అతడు ఈ మ్యాచ్‌లో ఎలాంటి పాత్ర పోషించాడో అర్థం చేసుకోవచ్చు.

తొలుత రిషబ్ పంత్‌ (111 బంతుల్లో 146 పరుగులు.. 20 ఫోర్లు, 4 సిక్సులు)తో కలిసి ఆరో వికెట్‌కు 222 పరుగుల విలువైన భాగస్వామ్యం నిర్మించిన జడేజా తర్వాత షమీ (16)తో కలిసి ఎనిమిదో వికెట్‌కు 48 పరుగులు అందించాడు. పంతే సగం పరుగులు చేసినా.. భారత్ 400 పైచిలుకు స్కోర్‌ చేసిందంటే దానికి కారణం జడేజానే. జడేజా (194 బంతుల్లో 104 పరుగులు.. 13ఫోర్లు) టెస్టుల్లో మూడో శతకం సాధించాడు. ఇక షమీ, జడేజా ఔటయ్యాక చివర్లో తాత్కాలిక కెప్టెన్, పేసర్ బుమ్రా సంచలన బ్యాటింగ్ చేశాడు. బుమ్రా 16 బంతుల్లో 31 పరుగులు చేశాడు. నాలుగు ఫోర్లు, రెండు సిక్సులు బాదాడు.

ట్రెండింగ్ వార్తలు