Rishabh Pant: ఇండియా బెస్ట్ వికెట్ కీపర్ – బ్యాటర్ రిషబ్ పంతేనట

ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరిగిన ఇంగ్లాండ్ వర్సెస్ ఇండియా ఐదో టెస్టులో టీమిండియా గతిని మార్చేశాడు రిషబ్ పంత్. 146పరుగులతో టీమిండియా స్కోరు బోర్డును 416 పరుగులకు పరుగులు పెట్టించాడు. ఒకానొక దశలో 98/5తో ఉన్న జట్టుకు పంత్ - జడేజా భాగస్వామ్యంతో 222 పరుగులు నెలకొల్పారు.

Rishabh Pant: ఇండియా బెస్ట్ వికెట్ కీపర్ – బ్యాటర్ రిషబ్ పంతేనట

Pant

 

 

Rishabh Pant: ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరిగిన ఇంగ్లాండ్ వర్సెస్ ఇండియా ఐదో టెస్టులో టీమిండియా గతిని మార్చేశాడు రిషబ్ పంత్. 146పరుగులతో టీమిండియా స్కోరు బోర్డును 416 పరుగులకు పరుగులు పెట్టించాడు. ఒకానొక దశలో 98/5తో ఉన్న జట్టుకు పంత్ – జడేజా భాగస్వామ్యంతో 222 పరుగులు నెలకొల్పారు.

టీమిండియా మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా పంత్ ను పొగిడేస్తూ.. ఇండియాకు బెస్ట్ ఎవర్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ అని కాంప్లిమెంట్ ఇచ్చాడు.

“రిషబ్ పంత్ టెస్టుల్లో ఇండియాకు బెస్ట్ వికెట్ కీపర్ బ్యాటర్.. ఇంకా 25ఏళ్లు కూడా నిండని పంత్.. 30మ్యాచ్ లను సెన్సేషనల్ గా ఆడాడు” అని పంత్ గురించి ఆకాశో చోప్రా పోస్టు పెట్టాడు.

 

పంత్ తో పాటుగా రవీంద్ర జడేజా 104పరుగులు నమోదు చేశాడు. రెండో రోజు ఆటలో సెంచరీ బాదేశాడు. పంత్, జడేజాల సెంచరీల తర్వాత ఇండియా 416 పరుగుల స్కోరు నమోదు చేసింది. ఇంగ్లాండ్ బౌలర్ అండర్సన్ ఐదు వికెట్లు తీయగలిగాడు.

స్టంప్స్ సమయానికి 84/5తో ఉన్న ఇంగ్లాండ్ ఇంకా 332 పరుగుల వెనుకంజలో ఉంది. జానీ బెయిర్ స్టో (12), బెన్ స్టోక్స్(0) క్రీజులో ఉన్నారు.