IND vs ENG: కళ్లుచెదిరే బంతితో.. జో రూట్‍కు దిమ్మతిరిగే షాకిచ్చిన సిరాజ్.. ఏం జరిగిందో అర్ధంకాక.. వీడియో వైరల్..

మహమ్మద్ సిరాజ్ సూపర్ బౌలింగ్‌తో కీలకమైన నాలుగు వికెట్లు పడగొట్టాడు. ముఖ్యంగా క్రీజులో పాతుకుపోయేందుకు ప్రయత్నిస్తున్న జో రూట్‌ను ఔట్ చేసిన విధానం అద్భుతమనే చెప్పొచ్చు.

mohammed siraj

IND vs ENG 5th Test: ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ జట్ల మధ్య లండన్‌లోని ఓవల్ మైదానంలో జరుగుతున్న ఐదో టెస్టు మ్యాచ్ రసవత్తరంగా మారింది. రెండో రోజు (శుక్రవారం) ఆటలో ఇండియా బౌలర్ల ధాటికి ఇంగ్లాండ్ బ్యాటర్లు వెంటవెంటనే పెవిలియన్ బాటపట్టారు. దీంతో భారత జట్టు రెండోరోజు ఆటలో పూర్తి ఆధిక్యాన్ని ప్రదర్శించింది.

Also Read: అదరగొట్టిన మహ్మద్ సిరాజ్.. జస్ర్పీత్ బుమ్రా రికార్డు బద్దలు.. 29ఏళ్ల తరువాత అరుదైన ఘనత..

శుక్రవారం ఉదయం  204/6 ఓవర్ నైట్ స్కోరుతో తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన భారత జట్టు.. మ్యాచ్ ప్రారంభమైన కొద్దిసేపటికే నాలుగు వికెట్లు కోల్పోయింది. ఫలితంగా కేవలం 224 పరుగులకే టీమిండియా ఆలౌట్ అయింది. ఆ తరువాత బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లాండ్ ఓపెనర్లు ప్రారంభంలో దూకుడుగా ఆడారు. దీంతో స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది. కేవలం 12 ఓవర్లకే ఇంగ్లాండ్ స్కోర్ 92కు చేరుకుంది. రెండో సెషన్ నుంచి భారత బౌలర్లు అద్భుత బౌలింగ్‌తో ఇంగ్లాండ్ బ్యాటర్లను హడలెత్తించారు. ఓకవైపు మహమ్మద్ సిరాజ్, మరోవైపు ప్రసిద్ధ్ కృష్ణలు కట్టుదిట్టమైన బంతులతో ఇంగ్లాండ్ బ్యాటర్లను వెంటవెంటనే ఔట్ చేశారు. దీంతో సిరాజ్, ప్రసిద్ధ్ చెరో నాలుగు వికెట్లు పడగొట్టగా.. ఆకాశ్‌దీప్ ఒక వికెట్ తీసుకున్నాడు.


మహమ్మద్ సిరాజ్ సూపర్ బౌలింగ్‌తో కీలకమైన నాలుగు వికెట్లు పడగొట్టాడు. ముఖ్యంగా క్రీజులో పాతుకుపోయేందుకు ప్రయత్నిస్తున్న జో రూట్‌ను ఔట్ చేసిన విధానం అద్భుతమనే చెప్పొచ్చు. బంతి మెరుపు వేగంతో వెళ్లి రూట్ ప్యాడ్స్‌కు తాకింది. వెంటనే అంపైర్ ఔట్ ఇవ్వగా.. జోరూట్‌కు ఏం జరిగిందో అర్ధంకాక రివ్యూ తీసుకున్నాడు. రివ్యూలో ఔట్ అని తేలడంతో అతను నిరాశగా పెవిలియన్ బాట పట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. జోరూట్‌తోపాటు ఓలీ పోప్, జాకబ్ బెథెల్, హ్యారీ బ్రూక్‌లనుసైతం సిరాజ్ ఔట్ చేశాడు.


భారత బౌలర్ల ధాటికి ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 247 పరుగులకే ఆలౌట్ అయింది. ఆ తరువాత రెండో ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ ప్రారంభించిన భారత జట్టు రెండోరోజు ఆట ముగిసే సమయానికి రెండు వికెట్లు కోల్పోయి 75 పరుగులు చేసింది. యశస్వీ జైస్వాల్ (51 బ్యాటింగ్), ఆకాశ్ దీప్ (4 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు.