IND vs NZ: భార‌త్‌ను హెచ్చరించిన న్యూజిలాండ్.. రోహిత్ టీంకు కష్టాలు పెరిగినట్లేనా!

టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ జట్ల మధ్య మూడు టెస్టుల సిరీస్ అక్టోబర్ 16 నుంచి ప్రారంభమవుతుంది. సిరీస్ లో తొలి మ్యాచ్ బెంగళూరు వేదికగా జరగనుంది.

IND vs NZ Test Series 2024

IND vs NZ Test Series 2024: టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ జట్ల మధ్య మూడు టెస్టుల సిరీస్ అక్టోబర్ 16 నుంచి ప్రారంభమవుతుంది. సిరీస్ లో తొలి మ్యాచ్ బెంగళూరు వేదికగా జరగనుంది. ఈ సిరీస్ ప్రారంభానికి ముందే న్యూజిలాండ్ జట్టు టీమిండియాకు హెచ్చరికలు పంపించింది. కివీస్ జట్టు కెప్టెన్ టామ్ లాథమ్ భారత పర్యటనపై కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ గడ్డపై క్రికెట్ ఆడటం అంటే మా జట్టుకు సవాలే. మేము అక్కడికి వెళ్లిన తరువాత స్వేచ్ఛ లభిస్తుందని ఆశిస్తున్నాం. మేము మరింత నిర్భయంగా క్రికెట్ ఆడగలం.. ఆతిధ్య జట్టుపై విజయం సాధించగలమని అన్నారు.

Also Read: T20 World Cup 2024 : టీ20ప్ర‌పంచ‌క‌ప్‌లో పాకిస్థాన్‌కు షాక్‌.. టోర్నీ మ‌ధ్య‌లోనే స్వ‌దేశానికి పాక్ కెప్టెన్..

భారత్ గడ్డపై గతంలో చాలాసార్లు టీమిండియాతో ఆడాం. దూకుడుగా క్రికెట్ ఆడటం ద్వారా రాణించామని టామ్ లూథమ్ తెలిపారు. దూకుడుగా ఆడుతూ వారిని ఒత్తిడిలోకి నెట్టాలి. అయితే, ఇప్పడే చెప్పటం కంటే భారత్ గడ్డపైకి అడుగుపెట్టిన తరువాత ఎలా ఆడాలో ప్రణాళికలు సిద్ధం చేసుకుంటామని చెప్పాడు. ఇదిలాఉంటే..న్యూజిలాండ్ జట్టు భారత్ గడ్డపై ఇప్పటి వరకు టెస్టు సిరీస్ ను గెలవలేదు. 1955-56లో టెస్టు సిరీస్ ఆడేందుకు కివీస్ జట్టు తొలిసారి భారత్ కు వచ్చింది. ఆ తరువాత న్యూజిలాండ్ జట్టుతో జరిగిన టెస్టు సిరీస్ లలో భారత్ ప్రతీసారి సొంతగడ్డపై ఓడిపోలేదు. టీమిండియా చివరిసారిగా 2021లో న్యూజిలాండ్ కు ఆతిథ్యమిచ్చింది. రెండు మ్యాచ్ లసిరీస్ ను భారత్ 1-0తో గెలుచుకుంది.

Also Read: PAK vs ENG : హ్యారీ బ్రూక్ పెను విధ్వంసం.. టెస్టు క్రికెట్ చరిత్రలో రెండో ఫాస్టెస్ట్ ట్రిపుల్ సెంచరీ..

టెస్ట్ మ్యాచ్ ల షెడ్యూల్ ఇలా..
మొదటి టెస్ట్ : అక్టోబర్ 16 – 20 (చిన్నస్వామి స్టేడియం , బెంగళూరు)
రెండో టెస్ట్ : అక్టోబర్ 24 – 28 (మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం, పూణె)
మూడో టెస్ట్ : నవంబర్ 1 -5 (వాంఖడే స్టేడియం, ముంబయి)