IND vs SA 1st test
ముగిసిన తొలి రోజు ఆట
భారత ఇన్నింగ్స్‌ల్లో 59 ఓవర్లు పూర్తి అయిన తరువాత వర్షం మొదలైంది. దీంతో ఆటగాళ్లు మైదానాన్ని వీడారు. పిచ్‌తో పాటు గ్రౌండ్ మొత్తాన్ని కవర్లతో కప్పి ఉంచారు. వర్షం కొనసాగుతుండగా వెలుతురు కూడా మందగించింది. దీంతో మరో 31 ఓవర్ల ఆట మిగిలి ఉండగానే తొలి రోజును ముగించారు. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 59 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 208 పరుగులు చేసింది. క్రీజులో కేఎల్ రాహుల్ (70), మహ్మద్ సిరాజ్ (0)లు ఉన్నారు.
UPDATE – Day 1 of the 1st #SAvIND Test has been called off due to rain ?️#TeamIndia 208/8 after 59 overs.
See you tomorrow for Day 2 action.
Scorecard – https://t.co/Zyd5kIcYso pic.twitter.com/tmvVtiwRfJ
— BCCI (@BCCI) December 26, 2023
కేఎల్ రాహుల్ హాఫ్ సెంచరీ..
నాంద్రే బర్గర్ బౌలింగ్‌లో సిక్స్ బాది 80 బంతుల్లో కేఎల్ రాహుల్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 52 ఓవర్లకు భారత స్కోరు 187 7. కేఎల్ రాహుల్ (50), జస్‌ప్రీత్ బుమ్రా (0)లు క్రీజులో ఉన్నారు.
Fighting FIFTY for @klrahul ??
14th Test 50 for him.
Live – https://t.co/Zyd5kIcqCQ #SAvIND pic.twitter.com/LI2mDf76V7
— BCCI (@BCCI) December 26, 2023
శార్దూల్ ఠాకూర్ ఔట్..
భారత్ క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోతుంది. రబాడ బౌలింగ్‌లో డీన్ ఎల్గర్ క్యాచ్ అందుకోవడంతో శార్దూల్ ఠాకూర్ (24) ఔట్ అయ్యాడు. దీంతో భారత్ 164 పరుగుల వద్ద ఏడో వికెట్ కోల్పోయింది.
అశ్విన్ ఔట్..
దక్షిణాఫ్రికా బౌలర్లు విజృంభించడంతో భారత్ కష్టాల్లో పడింది. 121 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయింది. క్రీజులో కేఎల్ రాహుల్ (11), శార్దూల్ ఠాకూర్ (0) లు ఉన్నారు. అంతకముందు విరాట్ కోహ్లీ(38), అశ్విన్(8)లు ఔట్ అయ్యారు.
శ్రేయస్ అయ్యర్ క్లీన్‌బౌల్డ్..
లంచ్ బ్రేక్ అనంతరం మొదటి ఓవర్‌లోనే భారత్ వికెట్ కోల్పోయింది. రబాడ బౌలింగ్‌లో శ్రేయస్ అయ్యర్(31; 50 బంతుల్లో 3ఫోర్లు, 1సిక్స్) క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. దీంతో భారత్ 92 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
లంచ్‌బ్రేక్.. టీమ్ఇండియా 91/3
మొదటి రోజు ఆటలో లంచ్ బ్రేక్ సమయానికి భారత్ 26 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 91 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ (33), శ్రేయస్ అయ్యర్ (31) లు క్రీజులో ఉన్నారు.
Virat Kohli and Shreyas Iyer steady ship for #TeamIndia with a 67* run partnership in the first session.#TeamIndia 91/3 at Lunch on Day 1 of the 1st Test.
Scorecard – https://t.co/032B8Fmvt4 #SAvIND pic.twitter.com/18p2abb5D6
— BCCI (@BCCI) December 26, 2023
శుభ్‌మన్ గిల్ విఫలం..
శుభ్‌మన్ గిల్ విఫలం అయ్యాడు. నాంద్రే బర్గర్ బౌలింగ్‌లో వెర్రెయిన్నే క్యాచ్ పట్టుకోవడంతో శుభ్‌మన్ గిల్ (2) ఔట్ అయ్యాడు. దీంతో భారత్ 24 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది.
యశస్వి జైస్వాల్ ఔట్..
భారత్ మరో వికెట్ కోల్పోయింది. నాంద్రే బర్గర్ బౌలింగ్‌లో వెర్రెయిన్నే క్యాచ్ అందుకోవడంతో యశస్వి జైస్వాల్ (17) ఔట్ అయ్యాడు. దీంతో భారత్ 23 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది.
రోహిత్ శర్మ విఫలం..
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. కెప్టెన్ రోహిత్ శర్మ (5) విఫలం అయ్యాడు. రబాడ బౌలింగ్‌లో నాండ్రే బర్గర్ క్యాచ్ అందుకోవడంతో ఔట్ అయ్యాడు. దీంతో భారత్ 13 పరుగుల వద్ద మొదటి వికెట్ కోల్పోయింది.
దక్షిణాఫ్రికా తుది జట్టు : డీన్ ఎల్గర్, ఐడెన్ మార్క్‌రామ్, టోనీ డిజోర్జి, టెంబా బావుమా(కెప్టెన్), కీగన్ పీటర్‌సన్, డేవిడ్ బెడింగ్‌హామ్, కైల్ వెర్రెయిన్నే(వికెట్ కీపర్), మార్కో జాన్సెన్, గెరాల్డ్ కోయెట్జీ, కగిసో రబాడ, నాండ్రే బర్గర్
భారత తుది జట్టు : టీమ్ఇండియా పేస్ బౌలర్ ప్రసిద్ధ్ కృష్ణ ఈ మ్యాచ్ ద్వారా టెస్టుల్లో అరంగ్రేటం చేశాడు. రోహిత్ శర్మ(కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ
? Team News ?
Prasidh Krishna makes his Test debut.
A look at #TeamIndia‘s Playing XI ?
Follow the Match ▶️ https://t.co/Zyd5kIcYso
??????: Mr Ravindra Jadeja complained of upper back spasms on the morning of the match. He was not available for selection for the… pic.twitter.com/r7Tch9hueo
— BCCI (@BCCI) December 26, 2023
ఆలస్యంగా టాస్..
రెండు టెస్టు మ్యాచుల సిరీస్‌లో భాగంగా సెంచూరియన్ వేదికగా జరుగుతున్న మొదటి టెస్టు మ్యాచులో భారత్, దక్షిణాఫ్రికా జట్లు తలపడుతున్నాయి. వర్షం కారణంగా ఔట్ ఫీల్డ్ తడిగా మారడంతో మ్యాచ్ సమయానికి కన్నా 15 నిమిషాల ఆలస్యంగా టాస్ వేశారు. టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా కెప్టెన్ టెంబా బావుమా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో భారత్ తొలుత బ్యాటింగ్‌కు దిగింది.