IND vs SA : భార‌త ప‌ర్య‌ట‌న‌కు ద‌క్షిణాఫ్రికా-ఏ టీమ్ ఇదే.. బ‌వుమాకు చోటు.. కెప్టెన్ ఎవ‌రంటే..?

ద‌క్షిణాఫ్రికా-ఏ జ‌ట్టు భార‌త్ (IND vs SA) ప‌ర్య‌ట‌న‌కు రానుంది. సీనియ‌ర్ ఆట‌గాడు టెంబా బావుమా అన‌ధికారిక టెస్టు జ‌ట్టులో చోటు ద‌క్కించుకున్నాడు.

IND vs SA : భార‌త ప‌ర్య‌ట‌న‌కు ద‌క్షిణాఫ్రికా-ఏ టీమ్ ఇదే.. బ‌వుమాకు చోటు.. కెప్టెన్ ఎవ‌రంటే..?

Temba Bavuma named in South Africa A squad for India tour

Updated On : October 17, 2025 / 12:58 PM IST

IND vs SA : ఈ ఏడాది న‌వంబ‌ర్‌లో ద‌క్షిణాఫ్రికా జ‌ట్టు భార‌త ప‌ర్య‌ట‌న‌కు రానుంది. ఈ ప‌ర్య‌ట‌న‌లో స‌ఫారీ జ‌ట్టు ఆతిథ్య భార‌త్‌తో రెండు టెస్టులు, మూడు వ‌న్డేలు, ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లు (IND vs SA) ఆడ‌నుంది. న‌వంబ‌ర్ 14న కోల్‌క‌తా వేదిక‌గా జ‌రగ‌నున్న తొలి టెస్టు మ్యాచ్‌తో ఈ సిరీస్ ప్రారంభం కానుంది.

అయితే.. ఈ సిరీస్ కన్నా ముందు ద‌క్షిణాఫ్రికా-ఏ జ‌ట్టు భార‌త్‌కు రానుంది. ఈ ప‌ర్య‌ట‌న‌లో ఆతిథ్య భార‌త్‌-ఏ జ‌ట్టుతో ద‌క్షిణాఫ్రికా రెండు మ్యాచ్‌ల అన‌ధికారిక టెస్టు సిరీస్‌తో పాటు మూడు మ్యాచ్‌ల వ‌న్డే సిరీస్ ఆడ‌నుంది. అక్టోబ‌ర్ 30 నుంచి ద‌క్షిణాఫ్రికా-ఏ ప‌ర్య‌ట‌న ఆరంభం కానుంది. ఈ నేప‌థ్యంలో భార‌త్‌లో ప‌ర్య‌టించే ప్రొటీస్‌-ఏ జ‌ట్ల‌ను ద‌క్షిణాఫ్రికా సెల‌క్ట‌ర్లు ప్ర‌కటించారు.

IND vs AUS : ఆస్ట్రేలియాలో ఆసీస్ పై భార‌త వ‌న్డే రికార్డు చూస్తే గుండె గుబేల్‌..

మార్క్వెస్ జానీ అకెర్‌మాన్ రెండు సిరీస్‌ల‌కు కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రించ‌నున్నాడు. ద‌క్షిణాఫ్రికా స్టార్‌, సీనియ‌ర్ ఆట‌గాడు టెంబా బావుమా అన‌ధికారిక టెస్టు జ‌ట్టులో చోటు ద‌క్కించుకున్నాడు.

ప్ర‌పంచ టెస్టు ఛాంపియ‌న్ షిప్ 2023-25 ఫైన‌ల్‌లో బ‌వుమా గాయ‌ప‌డిన సంగ‌తి తెలిసిందే. ఆ మ్యాచ్ త‌రువాత ఆట‌కు దూరంగా ఉన్నాడు. గాయం నుంచి కోలుకున్న బ‌వుమా ఫిట్‌నెస్ ను నిరూపించుకోవ‌డంతో పాటు ఫామ్ అందుకోవాల‌ని ప‌ట్టుద‌ల‌గా ఉన్నాడు. ఈ క్ర‌మంలోనే అత‌డు భార‌త్-ఏతో సిరీస్‌లో ఆడ‌నున్నాడు.

అనధికారిక టెస్టుల కోసం ద‌క్షిణాఫ్రికా జట్టు ఇదే..

మార్క్వెస్ అకెర్‌మాన్, టెంబా బావుమా, ఓకుహ్లే సెలె, జుబేర్ హంజా, జోర్డాన్ హెర్మాన్, రూబిన్ హెర్మాన్, రివాల్డో మూన్‌సామి, త్షెపో మోరేకి, మిహ్లాలీ మ్పోంగ్వానా, లెసెగో సెనోక్వానే, లెసెగో సెనోక్వానే, ప్రెనెలన్ సుబ్రాయెన్, కైల్ సిమ్మండ్స్, త్సెపో ద్వాండ్వా, జాసన్ స్మిత్, టియాన్ వాన్ వురెన్, కోడి యూసుఫ్.

IND vs AUS : భార‌త్‌తో తొలి వ‌న్డే మ్యాచ్‌కు ముందు ఆస్ట్రేలియాకు భారీ షాక్..

అన‌ధికారిక వన్డేల కోసం ద‌క్షిణాఫ్రికా జట్టు ఇదే..

మార్క్వెస్ అకెర్‌మాన్, ఒట్నీల్ బార్ట్‌మన్, బ్జోర్న్ ఫోర్టుయిన్, జోర్డాన్ హెర్మాన్, రూబిన్ హెర్మాన్, క్వేనా మఫాకా, రివాల్డో మూన్‌సామి, త్షెపో మోరెకి, మిహ్లాలీ మ్పోంగ్వానా, న్కాబా పీటర్, డెలానో పోట్‌గీటర్, లువాన్-డ్రే ప్రిటోరియస్, సినెథెంబ క్యూషీలే, జాసన్ స్మిత్, కోడి యూసుఫ్.