T20 World Cup 2026 : టీ20 ప్రపంచకప్ 2026లో పాల్గొనే 20 జట్లు ఇవే.. ఆఖరిన క్వాలిఫై అయిన టీమ్ పేరు వింటే షాకే..
వచ్చే ఏడాది జరగనున్న టీ20 ప్రపంచకప్‌లో (T20 World Cup 2026) పాల్గొనే 20 జట్లు ఏవో తెలిసిపోయింది.

Mens T20 World Cup 2026 All 20 teams confirmed
T20 World Cup 2026 : భారత్, శ్రీలంక దేశాలు ఆతిథ్యం ఇవ్వనున్న టీ20 ప్రపంచకప్ 2026లో పాల్గొనే జట్లు ఏవో ఖరారు అయిపోయాయి. మొత్తం 20 జట్లు ఈ మెగాటోర్నీలో కప్పు కోసం పోటీపడనున్నాయి. తాజాగా చివరి బెర్త్‌ను యూఏఈ దక్కించుకుంది. ఈస్ట్ ఏషియా పసిఫిక్ క్వాలిఫయర్స్‌లో జపాన్‌పై విజయం సాధించి యూఏఈ బెర్తును ఖాయం చేసుకుంది. ఇదే రీజియనల్ క్వాలిఫయర్ ద్వారా ఒమన్, నేపాల్ లు సైతం ప్రపంచకప్ బెర్త్‌లు ఖరారు చేసుకున్న సంగతి తెలిసిందే.
ఈ టోర్నీలో భారత్ డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగనుంది. సొంత గడ్డపై జరగనుండడంతో మరోసారి కప్పును ముద్దాడాలని భావిస్తోంది. ఇటలీ జట్టు తొలిసారి ఈ మెగా టోర్నీకి అర్హత సాధించింది.
నేరుగా అర్హత సాధించిన జట్లు ఇవే..
ఆతిథ్య హోదాలో భారత్, శ్రీలంక నేరుగా అర్హత సాధించాయి. టీ20 ప్రపంచకప్‌లో సూపర్-8 దశకు చేరిన ఏడు జట్లు.. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, అఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్, యూఎస్‌ఏ లు సైతం నేరుగా అర్హత సాధించాయి. ఇక ఐసీసీ ర్యాంకింగ్స్ ఆధారంగా న్యూజిలాండ్, పాకిస్తాన్, ఐర్లాండ్‌లు ప్రపంచకప్ బెర్తులను సాధించాయి.
IND vs AUS : భారత్‌తో తొలి వన్డే మ్యాచ్‌కు ముందు ఆస్ట్రేలియాకు భారీ షాక్..
క్వాలిఫయర్స్ ద్వారా ఏఏ జట్లు అర్హత సాధించాయంటే..?
అమెరికా రీజియనల్ క్వాలిఫయర్ ద్వారా కెనడా, యూరప్ క్వాలిఫయర్స్ ద్వారా నెదర్లాండ్స్, ఇటలీలు ఆఫ్రికా క్వాలిఫయర్ ద్వారా నమీబియా, జింబాబ్వేలు ఈస్ట్ ఏషియా పసిఫిక్ క్వాలిఫయర్ ద్వారా ఒమన్, నేపాల్, యూఏఈ జట్లు ప్రపంచకప్ బెర్తులను సాధించాయి.
టీ20 ప్రపంచకప్ 2026కి అర్హత సాధించిన జట్లు ఇవే..
భారత్, శ్రీలంక, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, అఫ్గానిస్తాన్, బంగ్లాదేశ్, అమెరికా, వెస్టిండీస్, పాకిస్తాన్, న్యూజిలాండ్, ఐర్లాండ్, కెనడా, ఇటలీ, నెదర్లాండ్స్, జింబాబ్వే, నమీబియా, నేపాల్, ఒమన్, యూఏఈ
IND vs AUS : ఆస్ట్రేలియాలో ఆసీస్ పై భారత వన్డే రికార్డు చూస్తే గుండె గుబేల్..
The 20 teams that will feature at next year’s Men’s #T20WorldCup have now been confirmed 🏆
More 👉 https://t.co/KdYn1GwAHz pic.twitter.com/97JMzgJ2SY
— ICC (@ICC) October 17, 2025
20 జట్లను నాలుగు గ్రూపులుగా..
టీ20 ప్రపంచకప్ 2026లో 20 జట్లు పాల్గొననున్నాయి. వీటిని 5 జట్ల చొప్పున నాలుగు గ్రూపులుగా విభజించనున్నారు. ప్రతి గూప్ నుంచి టాప్-2లో నిలిచిన జట్లు సూపర్-8కి చేరుకుంటాయి. సూపర్-8లో నాలుగు జట్ల చొప్పున రెండు గ్రూపులుగా విభజిస్తారు. గ్రూప్‌లో టాప్-2లో నిలిచిన జట్లు సెమీ ఫైనల్స్‌కు చేరుకుంటాయి. సెమీఫైనల్స్‌లో విజయం సాధించి జట్లు ఫైనల్‌లో కప్పు కోసం పోటీపడనున్నాయి.