Ind vs SA 1st Test day 1 stumps India trail by 122 runs
IND Vs SA : రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా కోల్‌కతా వేదికగా భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య తొలి టెస్టు మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ మొదటి ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టపోయి 37 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ (13), వాషింగ్టన్ సుందర్ (6) లు క్రీజులో ఉన్నారు. దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్ స్కోరుకు భారత్ ఇంకా 122 పరుగులు వెనుకబడి ఉంది.
దక్షిణాఫ్రికాను తొలి ఇన్నింగ్స్‌లో తక్కువ స్కోరుకు పరిమితం చేశామన్న ఆనందం భారత్‌కు ఎంతో సేపు నిలవలేదు. ఓపెనర్ యశస్వి జైస్వాల్ (12) జట్టు స్కోరు 18 పరుగుల వద్ద తొలి వికెట్ గా ఔట్ అయ్యాడు. అతడిని మార్కో జాన్సెన్ పెవిలియన్‌కు చేర్చాడు. వన్‌డౌన్‌లో వాషింగ్టన్ సుందర్ వచ్చాడు.
KKR : కోల్‌కతా నైట్‌రైడర్స్ కొత్త బౌలింగ్ కోచ్‌గా టిమ్ సౌథీ..
అతడు మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ తో కలిసి సఫారీ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు. పిచ్ బౌలర్లకు సహకరిస్తుండడంతో వీరిద్దరు క్రీజులో నిలదొక్కుకునేందుకు ప్రయత్నించారు. మరో వికెట్ పడకుండా తొలి రోజును ముగించారు. వెలుతురు మందగించడంతో తొలి రోజు ఆటను తొందరగానే ముగించారు.
Stumps on Day 1!
An entertaining day of Test cricket comes to an end 🙌
KL Rahul and Washington Sundar will resume proceedings tomorrow as #TeamIndia trail by 1⃣2⃣2⃣ runs.
Scorecard ▶️ https://t.co/okTBo3qxVH#INDvSA | @IDFCFIRSTBank pic.twitter.com/0eqZo73x9J
— BCCI (@BCCI) November 14, 2025
అంతకముందు తొలి ఇన్నింగ్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా మొదటి ఇన్నింగ్స్‌లో 55 ఓవర్లలో 159 పరుగులకు ఆలౌటైంది. దక్షిణాఫ్రికా బ్యాటర్లలో ఐడెన్ మార్‌క్రమ్ (31) టాప్ స్కోరర్. వియాన్ ముల్డర్ (24), టోనీ డి జోర్జీ (24), ర్యాన్ రికెల్టన్ (23), ట్రిస్టన్ స్టబ్స్ (15 నాటౌట్) లు పర్వాలేదనిపించారు.
IND vs SA : గంభీర్.. ఎంత నువ్వు లెఫ్ట్ హ్యాండ్ అయితే మాత్రం ఇలా చేస్తావా..
కెప్టెన్ టెంబా బవుమా (3) విపలం అయ్యాడు. భారత బౌలర్ల ధాటికి ఐదుగురు సఫారీ బ్యాటర్లు సింగిల్ డిజిట్‌కే పరిమితం అయ్యారు. ఇక టీమ్ఇండియా బౌలర్లలో బుమ్రా ఐదు వికెట్లు పడగొట్టాడు. మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్‌లు చెరో రెండు వికెట్లు తీశారు. అక్షర్ పటేల్ ఓ వికెట్ సాధించాడు.