Ind Vs SA : విజయానికి 6 వికెట్ల దూరంలో భారత్

దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టెస్టు మ్యాచ్ లో టీమిండియా గెలుపు దిశగా పయనిస్తోంది. ఈ టెస్ట్ మ్యాచ్ లో విజయానికి 6 వికెట్ల దూరంలో భారత జట్టు ఉంది. 305 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన

Ind Vs SA : సెంచురియన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టెస్టు మ్యాచ్ లో టీమిండియా గెలుపు దిశగా పయనిస్తోంది. ఈ టెస్ట్ మ్యాచ్ లో విజయానికి 6 వికెట్ల దూరంలో భారత జట్టు ఉంది. 305 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన సఫారీలు నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్లకు 94 పరుగులు చేశారు. ఆ జట్టు విజయం సాధించాలంటే ఇంకా 211 పరుగులు చేయాలి.

ఆటకు గురువారం(డిసెంబర్ 30) చివరి రోజు. కాగా, ఊపుమీదున్న టీమిండియా పేసర్లను ఎదుర్కోవడం దక్షిణాఫ్రికా లోయర్ ఆర్డర్ కు సవాలే. ప్రస్తుతం క్రీజులో కెప్టెన్ డీన్ ఎల్గార్ 52 పరుగులతో ఆడుతున్నాడు. ఆట మరికొంచెం సేపట్లో ముగుస్తుందనగా, బుమ్రా ఓ అద్భుతమైన బంతితో నైట్ వాచ్ మన్ కేశవ్ మహరాజ్ ను బౌల్డ్ చేశాడు.

Mark Zuckerberg: వ్యవసాయంలోకి మార్క్ జూకర్‌బర్గ్, రూ.127కోట్లతో స్థలం కొనుగోలు

అంతకుముందు, ఓపెనర్ ఐడెన్ మార్ క్రమ్ కేవలం ఒక పరుగు చేసి షమీ బౌలింగ్ లో ఔటయ్యాడు. 17 పరుగులు చేసిన కీగన్ పీటర్సన్ ను సిరాజ్ అవుట్ చేయగా, రాస్సీ వాన్ డెర్ డుస్సెన్ ను బుమ్రా తన ఖాతాలో వేసుకున్నాడు. భారత బౌలర్లలో బుమ్రా రెండు వికెట్లు తీశాడు. షమీ, సిరాజ్ చెరో వికెట్ తీశారు.

Scientists Warning: అంతరిక్షంలోకి మనుషులు వెళితే చంపుకుతినడం ఖాయం: శాస్త్రవేత్తలు

భారత్ తొలి ఇన్నింగ్స్ లో 327 పరుగులు చేయగా, ఆతిథ్య దక్షిణాఫ్రికా 197 పరుగులకే ఆలౌటైంది. రెండో ఇన్నింగ్స్ లో భారత్ 174 పరుగులు చేసింది. సౌతాఫ్రికా ముందు 305 పరుగుల టార్గెట్ ఉంచింది.

ట్రెండింగ్ వార్తలు