Mark Zuckerberg: వ్యవసాయంలోకి మార్క్ జూకర్‌బర్గ్, రూ.127కోట్లతో స్థలం కొనుగోలు

సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జూకర్‌బర్గ్ అంచనాలకు అతీతంగా ప్రవర్తిస్తుంటారు. ఫేస్ బుక్ ఆరంభించినప్పటి నుంచి కొత్త అప్ డేట్ లతో యూజర్లకు దగ్గరవుతూనే ఉన్న...

Mark Zuckerberg: వ్యవసాయంలోకి మార్క్ జూకర్‌బర్గ్, రూ.127కోట్లతో స్థలం కొనుగోలు

Mark Zukerberg

Updated On : December 29, 2021 / 10:34 AM IST

Mark Zuckerberg: సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జూకర్‌బర్గ్ అంచనాలకు అతీతంగా ప్రవర్తిస్తుంటారు. ఫేస్ బుక్ ఆరంభించినప్పటి నుంచి కొత్త అప్ డేట్ లతో యూజర్లకు దగ్గరవుతూనే ఉన్న మార్క్ ఇప్పుడూ కొత్త రూట్ పట్టారు. 17మిలియన్ డాలర్లు (రూ.127కోట్లు)తో Hawaiiలో స్థలం కొనుగోలు చేసి వ్యవసాయం మొదలుపెట్టనున్నారట.

ఇంతపెద్ద స్థలాన్ని వ్యాపారి కొనుగోలు చేయడమంటే అందరూ ఏదో పెద్ద ప్రాజెక్ట్ గురించే ఇలా చేస్తున్నారని అనుకోవచ్చు. కానీ, ఇదంతా వ్యవసాయం కోసమే అని చెప్తున్నారు జూకర్ బర్గ్ భార్య. 100ఏళ్ల నాటి కా లోకో రిజర్వాయర్ 2016లో ధ్వంసమైంది. వరదల కారణంగా జరిగిన ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు.

ప్రస్తుతం మెటా సీఈఓ 1500ఎకరాలు కొనుగోలుచేశారు. జూకర్ బర్గ్ అందులో పూర్తిగా వ్యవసాయం చేయాలనే అనుకుంటున్నారు. అంతేకాకుండా అటవీ జీవితాన్ని పెంచాలని ప్లాన్ చేస్తున్నారని అతని భార్య ప్రిస్కిల్లా చాన్ వెల్లడించారు.

ఇది కూడా చదవండి : శ్రీవారి సేవలో రోజా.. బీజేపీ, టీడీపీపై ఆగ్రహం

ఆ స్థలంలోనే విశాలవంతమైన ఇల్లు కట్టుకుని ఉంటారట. 35వేల 888 చదరపు గజాల్లో ఇంటి నిర్మాణం చేపడతారు. దీని విలువ దాదాపు 35మిలియన్ డాలర్ల వరకూ ఉంటుందని అంచనా.