MLA Roja : శ్రీవారి సేవలో రోజా.. బీజేపీ, టీడీపీపై ఆగ్రహం

నగరి ఎమ్మెల్యే రోజా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. బుధవారం ఉదయం వీఐపీ బ్రేక్ దర్శనంలో స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.

MLA Roja : శ్రీవారి సేవలో రోజా.. బీజేపీ, టీడీపీపై ఆగ్రహం

Mla Roja

MLA Roja : నగరి ఎమ్మెల్యే రోజా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. బుధవారం ఉదయం వీఐపీ బ్రేక్ దర్శనంలో స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ తమ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల గురించి తెలిపారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన రెండున్నర ఏళ్లలో తాము మ్యానిఫెస్టోలో పెట్టిన హామీలు 99 శాతం నెరవేర్చి ప్రజల మన్ననలు పొందామని తెలిపారు.

చదవండి : BJP vs YCP: బీజేపీ, వైసీపీ నేతల మధ్య డైలాగ్‌ వార్‌

ప్రభుత్వం తాజాగా తీసుకొచ్చిన ఓటీఎస్ పై ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు రోజా. తమ ఉనికిని కాపాడుకోడానికే ప్రతిపక్షాలు ఈ విధంగా చేస్తున్నాయన్నారామె. ఇక మంగళవారం విజయవాడ వేదికగా బీజేపీ నిర్వహించిన ప్రజాగ్రహ కార్యక్రమంపై కూడా రోజా కామెంట్స్ చేశారు. బీజేపీ ప్రజాగ్రహ సభ నిర్వహించడం హాస్యాస్పదమని అన్నారు. ప్రజలు బీజేపీ, టీడీపీలపై ఆగ్రహంతో ఉన్నారని.. వ్యాఖ్యానించారు.

చదవండి : MLA Roja : చంద్రబాబు దొంగ ఏడుపులను ప్రజలు నమ్మరు : ఎమ్మెల్యే రోజా

ఇక సినిమా టికెట్ల వ్యవహారంపై మాట్లాడుతూ.. ప్రభుత్వం సామాన్య ప్రేక్షకుల కోసమే సినిమా టికెట్ల ధరలు నిర్ణయించిందని తెలిపారు.
సినీ పరిశ్రమ, ప్రభుత్వంతో జరిపే చర్చల్లో మంచి నిర్ణయం తీసుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు రోజా. చర్చల్లో పెద్ద సినిమాలకు చిన్న సినిమాలకు ఉపయోగపడే విధంగా నిర్ణయం తీసుకుంటారని నమ్ముతున్నానన్నారు. చిరంజీవి, నాగార్జున, నిర్మాతలు ఆన్లైన్‌లో టికెట్లు పెట్టమని కోరారు వారి కోరిక మేరకే టికెట్లు ఆన్ లైన్‌లో పెట్టడం జరిగిందని రోజా తెలిపారు. కొందరు పొలిటికల్ గేమ్ కోసం పిచ్చి పిచ్చిగా మాట్లాడి సమస్యను జటిలం చేస్తున్నారని ఎమ్మెల్యే రోజా వ్యాఖ్యానించారు.

చదవండి : MLA Rajasingh : ‘దేవిశ్రీ ప్రసాద్‌పై చర్యలు తీసుకోవాలి’.. హైదరాబాద్‌ సీపీకి ఎమ్మెల్యే రాజాసింగ్‌ లేఖ