MLA Roja : చంద్రబాబు దొంగ ఏడుపులను ప్రజలు నమ్మరు : ఎమ్మెల్యే రోజా

టీడీపీ అధ్యక్షులు చంద్రబాబుపై వైసీపీ ఎమ్మెల్యే రోజా ఫైర్ అయ్యారు. విధి ఎవ్వరిని వదిలిపెట్టదని చంద్రబాబు తెలుసుకోవాలన్నారు.

MLA Roja : చంద్రబాబు దొంగ ఏడుపులను ప్రజలు నమ్మరు : ఎమ్మెల్యే రోజా

Roja

Updated On : November 19, 2021 / 6:23 PM IST

MLA Roja fired Chandrababu : టీడీపీ అధ్యక్షులు చంద్రబాబుపై వైసీపీ ఎమ్మెల్యే రోజా ఫైర్ అయ్యారు. విధి ఎవ్వరిని వదిలిపెట్టదని చంద్రబాబు తెలుసుకోవాలన్నారు. తన భార్యని అన్నారని తెగ ఫీల్ అయిపోతున్నారని…అధికారంలో ఉండగా ఎందరిని ఏడిపించారో చంద్రబాబు మర్చిపోయావా అంటూ ప్రశ్నించారు. ప్రధాని మోదీని ఆయన భార్యని కూడా తిట్టించారని రోజా గుర్తు చేశారు. విజయమ్మ, భారతి, షర్మిలను ఎన్ని రకాలుగా మాటలు అనిపించారో మర్చిపోయారన్నారు. చంద్రబాబు దొంగ ఏడుపులు ప్రజలు నమ్మరు, పట్టించుకోరన్నారు.

చంద్రబాబు భోరున విలపించారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక..తమను ఘోరంగా అవమానిస్తున్నారని, గత రెండున్నరేళ్లుగా బండబూతులు తిడుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. వెక్కివెక్కి ఏడ్చారు. కొద్దిసేపటి అనంతరం ఆయన మళ్లీ మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వం ప్రతిపక్షాన్ని అన్ని విధాల అవమానిస్తోంది.. వ్యక్తిగత విమర్శలు చేశారు..ఎన్నో అవమానాలు భరించామన్నారు. చివరకు తన భార్యను కూడా అవమానిస్తున్నారని, తన భార్య కూడా ఎంతో సహకరించిందని తెలిపారు.

RTC Bus In Flood Water : వరద నీటిలో కొట్టుకుపోయిన ఆర్టీసీ బస్సు..10మంది ప్రయాణికులు గల్లంతు

ఏపీ అసెంబ్లీ సమావేశంలో అధికారపక్షం, విపక్ష సభ్యుల మధ్య మాటలతూటాలు పేలాయి. ఈ సందర్భంగా సభలో జరిగిన తీరుపై చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని, తాను ముఖ్యమంత్రిగా గెలిచిన తర్వాతే..సభలో అడుగుపెడుతానని శపథం చేసి వెళ్లిపోవడం సంచలనం సృష్టించింది. అనంతరం మంగళగిరి టీడీపీ కార్యాలయంలో ఆయన ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కన్నీళ్లు పెట్టారు.