RTC Bus In Flood Water : వరద నీటిలో కొట్టుకుపోయిన ఆర్టీసీ బస్సు..10మంది ప్రయాణికులు గల్లంతు

కడప జిల్లాలో వర్ష బీభత్సం సృష్టిస్తోంది. రాజంపేట మండలం గుంటూరు వద్ద వరద ఉధృతికి వరద నీటిలో ఆర్టీసీ బస్సు కొట్టుకుపోయింది. 10మంది ప్రయాణికులు గల్లంతయ్యారు.

RTC Bus In Flood Water : వరద నీటిలో కొట్టుకుపోయిన ఆర్టీసీ బస్సు..10మంది ప్రయాణికులు గల్లంతు

Rtc Bus

RTC bus washed away in flood water : కడప జిల్లాలో వర్ష బీభత్సం సృష్టిస్తోంది. రాజంపేట మండలం గుంటూరు వద్ద వరద ఉధృతికి వరద నీటిలో ఆర్టీసీ బస్సు కొట్టుకుపోయింది. 10మంది ప్రయాణికులు గల్లంతయ్యారు. గల్లంతైన వారి కోసం పోలీసుల గాలిస్తున్నారు. భారీ వర్షాలకు మరోవైపు జిల్లాలోని అన్నమయ్య ప్రాజెక్టు మట్టికట్ట తెగింది. దీంతో ప్రాజెక్టు సమీపంలోని కాలనీలోకి భారీగా నీరు వచ్చి చేరింది. వరద ఉదృతి అధికంగా ఉండటంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

వర్షాలతో కడప నగరం జలమయమైంది..భారీగా కురుస్తున్న వర్షాలకు వరద నీరు ఇళ్ళల్లోకి వచ్చి చేరింది. నగరంలోని రహాదార్లపై ప్రమాదకర స్థాయిని మించి వరద నీరు ప్రవహిస్తుంది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఒక్కసారిగా వరద నీరు వచ్చి చేరడంతో పలు ప్రాంతవాసులు రాత్రికి రాత్రే ప్రాణాలు అరచేతీలో పట్టుకుని బయటపడ్డారు. నగరంలోని పలు ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి.

Vinod Kumar : మూడు వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవడాన్ని స్వాగతిస్తున్నాం : వినోద్ కుమార్

జిల్లాలో వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఇళ్లలోకి నీరు చేరడంతో తిండి తిప్పలు లేక ప్రజలు నానావస్థలు పడుతున్నారు. వర్షాల తీవ్రతకు జలాశయాల్లోకి భారీగా వరద నీరు చేరింది. సామర్థ్యానికి మించి వరద నీరు వచ్చి చేరుతుండటంతో అధికారులు దిగువ ప్రాంతాలకు నీటిని విడుదల చేస్తున్నారు. పింఛా డ్యామ్‌కు భారీగా వరద నీరు వచ్చి చేరడంతో నీటి ఉధృతికి రింగ్ బండ్ తెగిపోయింది.

ఊహకు అందని స్థాయిలో అన్నమయ్య ప్రాజెక్టుకు వరద నీరు వచ్చి చేరుతోంది. అన్నమయ్య ప్రాజెక్టుకు ప్రమాద ఘంటికలు మోగాయి. ప్రాజెక్టు మట్టికట్ట తెగిపోయింది.. దీంతో లోతట్టు ప్రాంతాల్లోకి భారీగా వరదనీరు వచ్చి చేరింది. ఊహించని స్థాయిలో నీరు వస్తుడటంతో కట్టుబట్టలతో లోతట్టు ప్రాంత వాసులు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లారు.