Vinod Kumar : మూడు వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవడాన్ని స్వాగతిస్తున్నాం : వినోద్ కుమార్

మూడు చట్టాల ఉపసంహరింపును స్వాగతిస్తున్నట్లు ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ అన్నారు. రైతులకు మద్దతుగా సీఎంతోపాటు ప్రజాప్రతినిధులు కలిసి ధర్నా చేయడం కూడా ఒక కారణం అన్నారు.

Vinod Kumar : మూడు వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవడాన్ని స్వాగతిస్తున్నాం : వినోద్ కుమార్

Vinod

Three agricultural laws repeal : మూడు వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవడాన్ని స్వాగతిస్తున్నామని ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ అన్నారు. రైతులకు మద్దతుగా ముఖ్యమంత్రితో పాటు ప్రజాప్రతినిధులు కలిసి ధర్నా చేయడం కూడా ఒక కారణం అన్నారు. కేవలం మూడు చట్టాలే కాకుండా పెట్రోలియంపై సెస్ ఉపసంహరించాలని కోరారు. ధాన్యం కొనుగోలు చేయబోమని నిన్న కేంద్రం ప్రకటించిందని తెలిపారు. మరి బండి సంజయ్ ఏం సమాధానం చెబుతారు..ఇప్పుడు ఎవరి మెడలు వంచుతారో చెప్పాలన్నారు.

ఇప్పటివరకు 18సార్లు పెట్రోలుపై సెస్ పెంచిందని తెలిపారు. ఇప్పటివరకు వసూలు చేసిన సెస్ రాష్ట్రాలకు పంపిణీ చేయాలన్నారు. రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్ గౌరవంగా మాట్లాడాలని సూచించారు. గత రెండు నెలలుగా బండి సంజయ్ రైతులను గందరగోళంలో నెట్టేశారని విమర్శించారు. మంత్రి పీయూష్ గోయెల్ సూచన మేరకు ముఖ్యమంత్రి, రైతులకు చెప్పే బాధ్యత తీసుకున్నామని వెల్లడించారు.

CM Jagan : బాబు ఫ్రస్ట్రేషన్‌లో ఉన్నారు – సీఎం జగన్

ఉత్తర్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్ లో ఓడిపోతామని మోదీ వెనక్కి తగ్గారని పేర్కొన్నారు. తాము ఆనాడే స్టాండింగ్ కమిటీకి పంపించాలంటే పట్టించుకోలేదన్నారు. ఆరు నెలల క్రితమే ఈ నిర్ణయం తీసుకుంటే రైతుల ప్రాణాలు దక్కేవని తెలిపారు. పెట్రోలియం ధరపై ఆందోళనలు చేస్తామని బండి సంజయ్ ప్రకటించారు..ముందు సెస్ ను రాష్ట్రాలకు పంచాలని డిమాండ్ చేశారు.