CM Jagan : బాబు ఫ్రస్ట్రేషన్‌లో ఉన్నారు – సీఎం జగన్

చంద్రబాబు డ్రామాను అందరం చూశామని సీఎం జగన్ అన్నారు. రాజకీయ అంజెండానే చంద్రబాబుకు ముఖ్యమని విమర్శించారు. ఫ్రస్ట్రేషన్ లో చంద్రబాబు మాట్లాడుతున్నారని తెలిపారు.

CM Jagan : బాబు ఫ్రస్ట్రేషన్‌లో ఉన్నారు – సీఎం జగన్

Jagan

Jagan criticized Chandrababu : టీడీపీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు చేసిన శపథంపై సీఎం జగన్ రియాక్ట్ అయ్యారు. ఆయన ప్రస్టేషన్ కు గురయ్యారని, ఆయనకు కేవలం రాజకీయ అజెండానే ముఖ్యమని ఎద్దేవా చేశారు. ఆయన కుటుంబసభ్యుల గురించి తాము మాట్లాడినట్లు బాబు చేసిన ఆరోపణలను సీఎం జగన్ తిప్పికొట్టారు. బాబే అతిగా రియాక్ట్ అయ్యారని…బాబు కుటుంబసభ్యుల గురించి ఎవరూ మాట్లాడలేదని చెప్పారు. 2021, నవంబర్ 19వ తేదీ శుక్రవారం ఏపీలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ప్రతిపక్షాన్ని అసలు పట్టించుకోవడం లేదని, అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తమను వేధిస్తున్నారంటూ..బాబు విమర్శలు గుప్పించారు. అనంతరం తాను సీఎం అయిన తర్వాతే..అసెంబ్లీలోకి అడుగుపెడుతానంటూ..శపథం చేసీ మరీ వెళ్లారు.

Read More : Becoming CM Again : ప్రజాక్షేత్రంలో పోరాడుతా ? ప్రజల్లో మార్పులు రావాలి

దీనిపై సీఎం జగన్ అసెంబ్లీలో మాట్లాడారు. తాను అసెంబ్లీలో అడుగుపెట్టే సమయానికే బాబు ఏమోషనల్ గా మాట్లాడుతున్నారని, ఏం మాట్లాడుతున్నారో.. ఏం చేస్తున్నారో ఆయనకు అర్థం కావడం లేదన్నారాయన. టీడీపీని ప్రజలు అస్సలు నమ్మే పరిస్థితిలో లేరని, కుప్పంలో పరాజయం చెందగానే..బాబు ఫ్రస్టేషన్ కు గురయ్యారని విమర్శించారు. ప్రజా సమస్యలపై ప్రతిపక్షం సూచనలు, సలహాలు ఇవ్వాలి..కానీ..అలాంటివి ప్రతిపక్షం ప్రస్తావించడం లేదని..కేవలం రాజకీయ లబ్ది జరగాలని బాబు కోరుకుంటారని వెల్లడించారు. సంబంధం లేని అంశాన్ని సభలో లేవనెత్తడం కరెక్టేనా అని ప్రశ్నించారు. దీనికి ప్రతిగా అధికార పార్టీకి సంబంధించిన వారు మాట్లాడడం జరుగుతుందని వివరించారు. అబద్ధాన్ని నిజం చేసేందుకు, చెప్పిందే చెప్పి దాన్ని నిజం చేయడానికి ప్రయత్నిస్తారని, గోబెల్స్‌ ప్రచారంలో వీళ్లు దిట్టలని విమర్శలు చేశారు.

Read More : Chandrababu: శపథాలు చేశారు.. సీఎంలు అయ్యారు.. జయలలిత, జగన్ తర్వాతెవరు..?

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సంచలన నిర్ణయం తీసుకున్నారు.. మళ్లీ ముఖ్యమంత్రిగా గెలిచే వరకు సభలో అడుగు పెట్టనంటూ శపథం చేశారు.. అంతకంటే ముందు సభలో మాట్లాడిన చంద్రబాబు ఉద్వేగానికి లోనయ్యారు.. రెండున్నరేళ్లుగా ఎన్నో అవమానాలను భరించానని.. తన భార్యపై కూడా అసభ్యంగా మాట్లాడుతున్నారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.. ఇంతలో స్పీకర్‌ మైక్‌ కట్‌ చేయడంతో సభ్యులకు నమస్కరిస్తూ టీడీపీ ఎమ్మెల్యేలలో వాకౌట్ చేశారు..