Becoming CM Again : ప్రజాక్షేత్రంలో పోరాడుతా ? ప్రజల్లో మార్పులు రావాలి

ఏపీ రాజకీయాల్లో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. సభలో జరిగిన పరిణామాలపై టీడీపీ అధినేత చంద్రబాబు బోరున విలపించారు.

Becoming CM Again : ప్రజాక్షేత్రంలో పోరాడుతా ? ప్రజల్లో మార్పులు రావాలి

Babu

Chandrababu Press Meet : ఏపీ రాజకీయాల్లో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. సభలో జరిగిన పరిణామాలపై టీడీపీ అధినేత చంద్రబాబు బోరున విలపించారు. తన కుటుంబాన్ని వ్యక్తిగతంగా టార్గెట్ చేయడంపై ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీ నుంచి బయటికొచ్చిన చంద్రబాబు మంగళగిరి టీడీపీ కార్యాలయంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన అనంతరం తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. తీవ్ర కన్నీటి పర్యంతమయ్యారు. ప్రజల్లోనే మార్పులు రావాలని, ప్రజాక్షేత్రంలోనే తాను పోరాడతనని, ధర్మాన్ని గెలిపించాలా..? అధర్మాన్ని గెలిపించాలా..? అనేది ప్రజలే తేల్చాలన్నారు.

Read More : TN Rains : తమిళనాడులో కుప్పకూలిన భవనం..ఒకే కుటుంబానికి చెందిన 9 మంది మృతి

అసెంబ్లీలో పరిణామాలపై ఆవేదన వ్యక్తం చేస్తూ… బోరున విలపించారు. తన భార్య గురించి అసభ్యంగా మాట్లాడుతున్నారని.. తన భార్య ప్రోత్సహించడం తప్పా… ఏనాడూ రాజకీయాల్లో జోక్యం చేసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యక్తిగత విమర్శలు సరికాదని భావోద్వేగానికి గురయ్యారు చంద్రబాబు. రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతుందని ఆరోపించారు. బీఏసీ సమావేశంలో కూడా అవహేళనగా మాట్లాడారని… తన జీవితంలో ఇలాంటి పరిణామాలు ఎప్పుడూ చూడలేదన్నారు చంద్రబాబు. నిండు సభలో ఆనాడు ద్రౌపదికి అవమానం జరిగిందని… ప్రజలు ప్రతిపక్షంలో కూర్చొబెట్టినా బాధ్యతగా భావించానని చెప్పారాయన.

Read More : TN Rains : తమిళనాడులో కుప్పకూలిన భవనం..ఒకే కుటుంబానికి చెందిన 9 మంది మృతి

40 ఏళ్లు పనిచేసింది ఇలా అవమానపడటానికా? అని బాధపడుతున్నానని చంద్రబాబు కన్నీరుమున్నీరయ్యారు. ప్రజలు ఓట్లేసి 151 సీట్లు వైసీపీకిచ్చి.. మాకు 23 స్థానాలు ఇచ్చినా నేను బాధపడలేదని, కానీ ఈ ప్రభుత్వం ప్రజల పాలిట భస్మాసుర హస్తంగా మారిందని విమర్శించారు. ఇది కౌరవ సభ.. గౌరవం లేని సభ అని అభివర్ణించారు. వైఎస్ తన తల్లిని దూషిస్తే.. గట్టిగా నిలదీస్తే క్షమాపణలు చెప్పారన్నారు. వాజ్ పేయి ప్రధానిగా ఉన్న రోజుల్లో ఏ రోజు వ్యక్తిగత, రాజకీయం కోసం ఏనాడూ పాకులాడ లేదన్నారు. రాష్ట్రం కోసం.. ప్రజల కోసమే పాటు పడ్డామని చెప్పుకొచ్చారు. తానేప్పుడూ వ్యక్తిగత పనులను ఆశించనని నాటి ప్రధాని వాజ్ పేయికి చెప్పడం జరిగిందని ఆ నాటి విషయాలను ప్రస్తావించారు.