IND vs SA 2nd ODI maiden ODI hundred for Ruturaj Gaikwad
Ruturaj Gaikwad : టీమ్ఇండియా మిడిల్ ఆర్డర్ బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ వన్డేల్లో తన తొలి శతకాన్ని నమోదు చేశాడు. రాయ్‌పుర్ వేదికగా దక్షిణాఫ్రికాతో రెండో వన్డే మ్యాచ్‌లో అతడు ఈ ఘనత అందుకున్నాడు. కార్బిన్ బాష్ బౌలింగ్‌లో ఫోర్ కొట్టి 77 బంతుల్లో మూడు అంకెల స్కోరు సాధించాడు. ఇందులో 12 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి.
ఈ మ్యాచ్‌కు ముందు వరకు రుతురాజ్ (Ruturaj Gaikwad) 8 వన్డేలో ఆడాడు. 18.1 సగటుతో 127 పరుగులు మాత్రమే చేశాడు. అత్యధిక స్కోరు 71.
Rohit Sharma : హ్యాట్రిక్ ఫోర్లు కొట్టి ఔటైన రోహిత్ శర్మ.. భారీ రికార్డు మిస్.. అయినా గానీ..
Maiden ODI Century! 💯🥳
A special knock this from Ruturaj Gaikwad! 🔥
Updates ▶️ https://t.co/oBs0Ns6SqR#TeamIndia | #INDvSA | @IDFCFIRSTBank pic.twitter.com/cnIhlR5JgE
— BCCI (@BCCI) December 3, 2025
ఇక రాయ్‌పుర్ మ్యాచ్‌లో రెండో వికెట్‌గా యశస్వి జైస్వాల్ (22) ఔటైన తరువాత క్రీజులోకి వచ్చాడు రుతురాజ్ గైక్వాడ్. ఆడిన తొలి బంతినే సిక్స్‌గా మలిచాడు. ఆ తరువాత కాస్త ఇబ్బంది పడినప్పటికి క్రీజులో కుదురుకున్న తరువాత తనదైన శైలిలో స్వేచ్ఛగా ఆడాడు. సీనియర్ ఆటగాడు విరాట్ కోహ్లీతో కలిసి మూడో వికెట్‌కు 195 భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.
Harshit Rana : గంభీర్ ప్రియ శిష్యుడికి ఐసీసీ బిగ్ షాక్..
సెంచరీ అనంతరం మార్కో జాన్సెన్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించిన రుతురాజ్ గైక్వాడ్.. డి జోర్జి క్యాచ్ అందుకోవడంతో ఔట్ అయ్యాడు. ఈ మ్యాచ్‌లో మొత్తంగా రుతురాజ్ 83 బంతులు ఎదుర్కొన్నాడు. 12 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 105 పరుగులు చేశాడు.