Rohit Sharma : హ్యాట్రిక్ ఫోర్లు కొట్టి ఔటైన రోహిత్ శర్మ.. భారీ రికార్డు మిస్.. అయినా గానీ..
టీమ్ఇండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma )ఓ భారీ రికార్డును తృటిలో మిస్సైయ్యాడు.
IND vs SA 2nd ODI Rohit Sharma just miss Monumental Milestone
Rohit Sharma : టీమ్ఇండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ఓ భారీ రికార్డును తృటిలో మిస్సైయ్యాడు. రాయ్‌పుర్ వేదికగా దక్షిణాఫ్రికాతో రెండో వన్డే మ్యాచ్‌లో రోహిత్ శర్మ 14 పరుగులు మాత్రమే చేశాడు. ఈ మ్యాచ్‌లో ఎనిమిది బంతులు ఎదుర్కొన్న హిట్‌మ్యాన్.. ఇన్నింగ్స్ ఐదో ఓవర్‌లో నాంద్రే బర్గర్ బౌలింగ్‌లో హ్యాట్రిక్ ఫోర్లు బాదాడు. అదే ఓవర్‌లో మరో షాట్‌కు యత్నించి వికెట్ కీపర్ క్వింటన్ డికాక్ క్యాచ్ అందుకోవడంతో పెవిలియన్‌కు చేరుకున్నాడు.
రాయ్‌పుర్ వన్డే మ్యాచ్‌లో రోహిత్ శర్మ (Rohit Sharma ) 41 పరుగులు చేసి ఉంటే.. అంతర్జాతీయ క్రికెట్‌లో (మూడు ఫార్మాట్లలో) 20,000 పరుగులు పూర్తి చేసి ఉండేవాడు. అప్పుడు ఈ ఘనత సాధించిన నాలుగో భారత ఆటగాడిగా నిలిచి ఉండేవాడు. సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, రాహుల్ ద్రవిడ్‌లు మాత్రమే టీమ్ ఇండియా తరుపున 20 వేల కంటే ఎక్కువ పరుగులు చేశారు.
Harshit Rana : గంభీర్ ప్రియ శిష్యుడికి ఐసీసీ బిగ్ షాక్..
విశాఖలో ఛాన్స్ ఉంది?
ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ ఈ రికార్డును అందుకోలేకపోయినప్పటికి కూడా శనివారం (డిసెంబర్ 6న) విశాఖ వేదికగా జరగనున్నమూడో వన్డే మ్యాచ్‌లో అందుకునే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే.. టెస్టులు, టీ20లకు రిటైర్‌మెంట్ ప్రకటించిన రోహిత్ శర్మ ప్రస్తుతం వన్డేలు మాత్రమే ఆడుతున్న సంగతి తెలిసిందే.
అంతర్జాతీయ క్రికెట్‌లో 20000 ఫ్లస్ పరుగులు చేసిన భారత బ్యాటర్లు వీరే..
* సచిన్ టెండూల్కర్ – 34357 పరుగులు
* విరాట్ కోహ్లీ – 27808 పరుగులు (రాయ్‌పుర్ వన్డే మ్యాచ్‌కు ముందు పరుగులు)
* రాహుల్ ద్రవిడ్ – 24064 పరుగులు
