×
Ad

IND vs SA : సెంచ‌రీల‌తో చెల‌రేగిన కోహ్లీ, రుతురాజ్‌.. రెండో వ‌న్డేలో ద‌క్షిణాఫ్రికా ముందు భారీ ల‌క్ష్యం..

రాయ్‌పుర్ వేదిక‌గా జ‌రుగుతున్న రెండో వ‌న్డే మ్యాచ్‌లో (IND vs SA) ద‌క్షిణాఫ్రికా ముందు టీమ్ఇండియా భారీ ల‌క్ష్యాన్ని నిర్దేశించింది.

IND vs SA 2nd ODI Virat Kohli and Ruturaj Gaikwad centuries help team india to get big total

IND vs SA : టీమ్ఇండియా సీనియ‌ర్ ఆట‌గాడు విరాట్ కోహ్లీతో పాటు యువ ఆట‌గాడు రుతురాజ్ గైక్వాడ్ శ‌త‌కాల‌తో చెల‌రేగాడు. దీంతో రాయ్‌పుర్ వేదిక‌గా జ‌రుగుతున్న రెండో వ‌న్డే మ్యాచ్‌లో (IND vs SA) ద‌క్షిణాఫ్రికా ముందు టీమ్ఇండియా 359 ప‌రుగుల భారీ ల‌క్ష్యాన్ని నిర్దేశించింది.

టీమ్ఇండియా బ్యాట‌ర్ల‌లో విరాట్ కోహ్లీ (102; 93 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స‌ర్లు), రుతురాజ్ గైక్వాడ్ (105; 83 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్స‌ర్లు) సెంచ‌రీలు చేయ‌గా కెప్టెన్ కేఎల్ రాహుల్ (66 నాటౌట్; 43 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స‌ర్లు) హాఫ్ సెంచ‌రీతో రాణించడంతో భార‌త్ నిర్ణీత 50 ఓవ‌ర్ల‌లో 5 వికెట్ల న‌ష్టానికి 358 ప‌రుగులు చేసింది.

Virat Kohli : కోహ్లీ శ‌త‌కాల మోత‌.. వ‌రుస‌గా రెండో వ‌న్డేలోనూ సెంచ‌రీ..

మిగిలిన వారిలో ర‌వీంద్ర జ‌డేజా (24 నాటౌట్‌), య‌శ‌స్వి జైస్వాల్ (22) లు ప‌ర్వాలేద‌నిపించారు. రోహిత్ శ‌ర్మ (14), వాషింగ్ట‌న్ సుంద‌ర్ (1) లు విఫ‌లం అయ్యారు. ద‌క్షిణాఫ్రికా బౌల‌ర్ల‌లో మార్కో జాన్సెన్ రెండు వికెట్లు తీశాడు. నాంద్రే బర్గర్, లుంగి ఎంగిడి లు చెరో వికెట్ ప‌డ‌గొట్టారు.

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భార‌త్ 62 ప‌రుగుల‌కే రెండు వికెట్లు కోల్పోయి క‌ష్టాల్లో ప‌డిన‌ట్లుగా క‌నిపించింది. అయితే.. మూడో వికెట్‌కు విరాట్‌, రుతురాజ్ జోడీ 195 ప‌రుగుల భారీ భాగ‌స్వామ్యాన్ని నెల‌కొల్పారు.