×
Ad

IND vs SA : కెప్టెన్ అంటే ఇలా ఆడాలి? రిష‌బ్ పంత్ బ్యాటింగ్ పై సెటైర్లు..

గౌహ‌తి వేదిక‌గా ద‌క్షిణాఫ్రికాతో జ‌రుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లోనూ టీమ్ఇండియా బ్యాట‌ర్ల (IND vs SA)ఆట తీరు ఏమాత్రం మార‌లేదు.

IND vs SA 2nd test Rishabh Pant Takes SHOCKING Review India in big trouble

IND vs SA : గౌహ‌తి వేదిక‌గా ద‌క్షిణాఫ్రికాతో జ‌రుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లోనూ టీమ్ఇండియా బ్యాట‌ర్ల ఆట తీరు ఏమాత్రం మార‌లేదు. తొలి ఇన్నింగ్స్‌లో 123 ప‌రుగుల‌కే ఏడు వికెట్లు కోల్పోయి పీక‌ల్లోతు క‌ష్టాల్లో ప‌డింది.

9/0 ఓవర్ నైట్ స్కోర్‌తో మూడో రోజు తొలి ఇన్నింగ్స్‌ను కొన‌సాగించిన భార‌త్‌కు ఓపెన‌ర్లు కేఎల్ రాహుల్‌(22; 63 బంతుల్లో 2 ఫోర్లు), జైశ్వాల్‌(58; 97 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్‌) శుభారంభం అందించారు. వీరిద్ద‌రు తొలి వికెట్‌కు 65 ప‌రుగుల భాగ‌స్వామ్యాన్ని నెల‌కొల్పారు. రాహుల్‌ను స్పిన్న‌ర్‌ కేశ‌వ్ మ‌హారాజ్ ఔట్ చేయ‌డంతో భార‌త్ తొలి వికెట్ కోల్పోయింది. ఆ త‌రువాత బ్యాట‌ర్లు పెవిలియ‌న్‌కు క్యూ క‌ట్టారు. సాయిసుద‌ర్శ‌న్‌(15), ధ్రువ్ జురెల్‌(0) వ‌రుస ఓవ‌ర్ల‌లో ఔట్ అయ్యారు.

Salman Ali Agha : చ‌రిత్ర సృష్టించిన పాక్ టీ20 కెప్టెన్ స‌ల్మాన్ అలీ అఘా.. రాహుల్ ద్ర‌విడ్ వ‌ర‌ల్డ్ రికార్డు బ్రేక్‌..

దీంతో భార‌త్ 102 ప‌రుగులే నాలుగు వికెట్లు కోల్పోయింది. ఈ స‌మ‌యంలో క్రీజులో ఉన్న కెప్టెన్ రిష‌బ్ పంత్ ( 7; 8 బంతుల్లో ఓ సిక్స్‌) ఎంతో బాధ్య‌తాయుతంగా ఆడతాడ‌ని అంతా భావించారు. అయితే.. పంత్ మాత్రం జ‌ట్టును ఆదుకోవాల్సిన పోయి క‌ష్టాల్లోకి నెట్టేశాడు. నిర్ల‌క్ష్యంగా షాట్ ఆడి త‌న వికెట్ ను స‌మ‌ర్పించాడు.

38వ‌ ఓవ‌ర్‌ను మార్కో జాన్సెసన్ వేశాడు. ఈ ఓవ‌ర్‌లోని రెండో బంతిని ఆఫ్ స్టంప్ దిశగా షార్ట్ ఆఫ్ గుడ్ లెంగ్త్ డెలివరీగా సంధించాడు. పంత్ క్రీజు నుంచి ముందుకు వ‌చ్చి స్లాగ్ షాట్ కోసం య‌త్నించాడు. అయితే.. బంతి ఎడ్జ్ తీసుకుని వికెట్ కీప‌ర్ చేతుల్లోకి వెళ్లింది. అంపైర్ ఔట్ ఇవ్వ‌గా.. పంత్ రివ్య్వూ తీసుకున్నాడు. రివ్వ్యూలో బంతి ఎడ్జ్ తీసుకున్న‌ట్లు స్పష్టంగా క‌నిపించింది.

కెప్టెన్‌గా ఆదుకోవాల్సి పోయి.. నిర్ల‌క్ష్యంగా షాట్ ఆడ‌డం, రివ్వ్యూ వృథా చేయ‌డం పై నెటిజ‌న్లు మండిప‌డుతున్నారు. జ‌ట్టు క‌ష్టాల్లో ఉన్న‌ప్పుడు అలాంటి షాట్లు అవ‌స‌ర‌మా అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Smriti Mandhana : స్మృతి మంధాన తండ్రే కాదు.. కాబోయే భ‌ర్త‌కు అనారోగ్యం.. ఆస్ప‌త్రిలో చేరిన ప‌లాష్ ముచ్చ‌ల్‌..

పంత్ త‌రువాత స్వ‌ల్ప వ్య‌వ‌ధిలో నితీశ్ కుమార్ రెడ్డి (10), ర‌వీంద్ర జ‌డేజా (6)లు సైతం పెవిలియ‌న్‌కు చేరుకోవ‌డంతో భార‌త్ 122 ప‌రుగుల‌కే 7 వికెట్లు కోల్పోయి క‌ష్టాల్లో ప‌డింది.