IND vs SA 2nd Test Team India 201 all out in 1st Innings
IND vs SA : గౌహతి వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో భారత బ్యాటర్లు ఘోరంగా విఫలం అయ్యారు. దీంతో టీమ్ఇండియా మొదటి ఇన్నింగ్స్‌లో 201 పరుగులకే ఆలౌటైంది. దక్షిణాఫ్రికాకు 288 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. భారత్‌ను ఫాలో ఆన్ ఆడించే అవకాశం ఉన్నప్పటికి కూడా దక్షిణాఫ్రికా కెప్టెన్ బవుమా అందుకు నిరాకరించాడు. నాలుగో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు కష్టమయ్యే అవకాశం ఉండడంతో అతడు ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.
ఇక టీమ్ఇండియా బ్యాటర్లలో యశస్వి జైస్వాల్ (59; 97 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్) హాఫ్ సెంచరీ చేశాడు. వాషింగ్టన్ సుందర్ (48; 92 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు. కేఎల్ రాహుల్ (22), కుల్దీప్ యాదవ్ (19) పర్వాలేదనిపించారు.
IND vs SA : తిలక్ వర్మపై ఇర్ఫాన్ పఠాన్ కామెంట్స్.. వన్డేల్లో అతడిని..
ధ్రువ్ జురెల్ డకౌట్ కాగా.. సాయి సుదర్శన్ (15), రిషబ్ పంత్ (7), రవీంద్ర జడేజా (6), నితీశ్ కుమార్ రెడ్డి(10)లు ఘోరంగా విఫలం అయ్యారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో మార్కో జాన్సెన్ ఆరు వికెట్లు తీశాడు. సైమన్ హార్మర్ మూడు వికెట్లు పడగొట్టాడు. కేశమ్ మహరాజ్ ఓ వికెట్ సాధించాడు.
Innings Break!#TeamIndia trail South Africa by 288 runs.
Over to our bowlers in the second innings.
Scorecard ▶️ https://t.co/Hu11cnrocG#INDvSA | @IDFCFIRSTBank pic.twitter.com/qG9qEx4j94
— BCCI (@BCCI) November 24, 2025
అంతక ముందు దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 489 పరుగులు చేసిన సంగతి తెలిసిందే.