Ind Vs SA : డికాక్ సెంచరీ, భారీ స్కోర్ దిశగా సౌతాఫ్రికా

భారత్ తో మూడో వన్డేలో సౌతాఫ్రికా ఓపెనర్ క్వింటన్ డికాక్ సెంచరీ బాదాడు. 108 బంతుల్లో 100 పరుగులు చేశాడు. వన్డే కెరీర్ లో డికాక్ కు ఇది 17వ శతకం.

Ind Vs SA : భారత్ తో మూడో వన్డేలో సౌతాఫ్రికా ఓపెనర్ క్వింటన్ డికాక్ సెంచరీ బాదాడు. 108 బంతుల్లో 100 పరుగులు చేశాడు. వన్డే కెరీర్ లో డికాక్ కు ఇది 17వ శతకం. డికాక్ శతకం ఫలితంగా దక్షిణాఫ్రికా భారీ స్కోర్ దిశగా సాగుతోంది. 34.2 ఓవర్లలోనే ఆ జట్టు 200 పరుగులు చేసింది. సౌతాఫ్రికా బ్యాటర్లలో మలన్(1), కెప్టెన్ బవుమా(8) మార్ క్రమ్ (15) తక్కువ స్కోర్ కే అవుటయ్యారు. డస్సెన్ హాఫ్ సెంచరీ బాదాడు. 124 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద డికాక్ ఔటయ్యాడు. డికాక్ ను బ్రుమా పెవిలియన్ పంపాడు. మూడో వన్డేలో టాస్ గెలిచిన టీమిండియా ఫీల్డింగ్ ఎంచుకుంది.

Mahesh Babu: గౌతమ్‌ని డబ్బుంది కాబట్టి బతికించుకున్నాం.. లేని వాళ్ళ పరిస్థితి ఏంటి అని ఆలోచించా..

మూడు వన్డేల సిరీస్ లో సౌతాఫ్రికా ఇప్పటికే 2-0 తేడాతో సిరీస్ ను కైవసం చేసుకుంది. మూడో వన్డేలో కూడా నెగ్గి క్లీన్ స్వీప్ చేయాలని దక్షిణాఫ్రికా పట్టుదలగా ఉంటే.. ఆఖరి మ్యాచ్ లో అయినా గెలిచి పరువు నిలుపుకోవాలని భారత జట్టు ఆశిస్తోంది.

ట్రెండింగ్ వార్తలు