Mahesh Babu: గౌతమ్‌ని డబ్బుంది కాబట్టి బతికించుకున్నాం.. లేని వాళ్ళ పరిస్థితి ఏంటి అని ఆలోచించా..
ఈ సందర్భంలో మహేష్ బాబు మాట్లాడుతూ.. తను ఎందుకు చిన్నారులకు హార్ట్ ఆపరేషన్స్ చేయించాలని అనుకున్నారో అందుకు గల కారణాన్ని తెలియజేశారు................

Mahesh Babu : బాలకృష్ణ హోస్ట్ గా చేస్తున్న ‘అన్ స్టాపబుల్ విత్ NBk’ ఆహా ఓటీటీలో అదరగొడుతుంది. ఈ షోలో వచ్చిన గెస్టులతో కలిసి ప్రేక్షకులని బాలకృష్ణ తనదైన శైలిలో ఎంటర్టైన్ చేస్తున్నారు. IMDBలో 9.8 టాప్ రేటింగ్ తో నంబర్ 1 పొజిషన్ లో దూసుకుపోతుంది ఈ షో. ఇక ఈ సీజన్ లాస్ట్ ఎపిసోడ్ పదవ ఎపిసోడ్ కి గెస్ట్ గా సూపర్ స్టార్ మహేష్ బాబు వస్తున్నారు. తాజాగా ఈ ఎపిసోడ్ ప్రోమోని రిలీజ్ చేశారు. ఈ ప్రోమోలో మహేష్ చాలా ఆసక్తికర విషయాలని వెల్లడించారు.
మహేష్ బాబు ఎంతో మంది హృద్యోగ సమస్యలు ఉన్న పేద చిన్నారులకి సహాయం చేసి వారికి తన సొంత డబ్బుతో ఆపరేషన్స్ చేయించి ప్రాణాలు కాపాడాడు. ఇప్పటివరకు 1058 మంది చిన్నారుల ప్రాణాలని కాపాడాడు మహేష్ బాబు. తాజాగా ‘అన్ స్టాపబుల్ విత్ NBk’ షోకి వచ్చిన మహేష్ ఈ ఆపరేషన్స్ వెనక ఉన్న కారణాన్ని చెప్పాడు.
Mahesh Babu : కరోనా తగ్గాక మొదటిసారి బయటకి వచ్చిన మహేష్.. రమేష్‌బాబు కార్యక్రమంలో..
బాలకృష్ణ మాట్లాడుతూ.. అన్ని దానాల కంటే అన్నదానం గొప్పదని అంటారు. ఆ అన్నదానం కంటే ప్రాణదానం ఇంకా గొప్పదంటారు. వెయ్యికి పైగా చిన్నారులకు గుండె ఆపరేషన్ చేయించి గుండెల్లో నిలిచిపోయాడు మహేష్ అని చెప్పి మహేష్ బాబు చేసిన సాయంతో హార్ట్ ఆపరేషన్స్ చేయించుకుని ప్రాణాలను దక్కించుకున్న ఇద్దరు చిన్నారులను వాళ్ళ పేరెంట్స్ ని స్టేజ్ మీదికి తీసుకుని వచ్చారు. ఆ చిన్నారుల తల్లిదండ్రులు కన్నీళ్లు పెట్టుకొని ఎమోషనల్ అయ్యారు.
Supritha : ఇది మ్యాటర్.. ప్రేమపై క్లారిటీ ఇచ్చిన సురేఖ కూతురు..
ఈ సందర్భంలో మహేష్ బాబు మాట్లాడుతూ.. తను ఎందుకు చిన్నారులకు హార్ట్ ఆపరేషన్స్ చేయించాలని అనుకున్నారో అందుకు గల కారణాన్ని తెలియజేశారు. ”గౌతమ్ ఆరు వారాలు ముందుగానే పుట్టేశాడు. పుట్టినప్పుడు సరిగ్గా నా చేయి అంతే ఉన్నాడు. ఇప్పుడు ఆరు అడుగులు ఉన్నాడు. మాకు డబ్బులు ఉన్నాయి కాబట్టి ఓకే కానీ చాలామంది లేని వాళ్లు ఉన్నారు. మరి వాళ్ల పరిస్థితి ఏంటి? ఆ చిన్నారులు ఏం కావాలి? అలాంటి వాళ్ల కోసం ఏదైనా చేయాలని అనుకున్నాను. అప్పటి నుంచి చిన్నారులకు హార్ట్ ఆపరేషన్స్ చేయిస్తున్నాను’ అని తెలిపారు.
మరోసారి మహేష్ బాబుని అభిమానులు, ప్రేక్షకులు పొగిడేస్తున్నారు. ఈ ఎపిసోడ్ కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఫిబ్రవరి 4న ఆహా ఓటీటీలో ఈ ఎపిసోడ్ స్ట్రీమింగ్ అవ్వనుంది.
- Mahesh Babu : సర్కారు వారి పాట.. మ మ మాస్ సెలబ్రేషన్స్.. కర్నూలులో..
- Sarkaru Vaari Paata : సినిమా రిలీజ్ అయ్యాక మహేష్.. డైరెక్టర్ పరశురామ్‌కి ఫోన్ చేసి ఏం చెప్పారో తెలుసా??
- Legend 2: బోయపాటితో అఖండ నిర్మాత ప్లాన్.. లెజెండ్ సీక్వెల్ చేస్తున్నారా?
- OTT Platforms: నువ్వా నేనా తేల్చుకుందాం.. ఆడియన్స్ కోసం ఓటీటీల పోటీ!
- Mahesh Babu : మీరెంత చేసినా సినిమా, కలెక్షన్స్ హిట్.. ‘సర్కారు వారి పాట’ నెగిటివ్ ట్రెండ్స్‌పై మైత్రి మూవీ మేకర్స్ ట్వీట్..
1Indonesia Bus Crash: బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంతో 15 మంది మృతి..16 మందికి తీవ్ర గాయాలు
2Sathya Sai School: శ్రీ సత్య సాయి సెకండరీ స్కూల్ అడ్మిషన్లు ప్రారంభం
3Budda Vanam : తెలంగాణ బుద్ధుని మార్గంలో పయనిస్తోంది : సీఎ కేసీఆర్
4Kerala Court: 25 మంది ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ సభ్యులకు జీవిత ఖైదు విధించిన కేరళ కోర్టు
5Russia Serious Warning : చాలా పెద్ద తప్పు చేస్తున్నారు, తీవ్ర పరిణామాలు తప్పవు- ఆ దేశాలకు రష్యా వార్నింగ్
6OTT Release: గెట్ రెడీ.. ఈ వారం ఓటీటీలో రాబోయే సినిమాలివే!
7Cab Driver: జాత్యహంకార కామెంట్లు చేసే వ్యక్తి రైడ్ నిరాకరకించిన క్యాబ్ డ్రైవర్
8Gujarat Mysterious Metal Balls : మూడు రోజులుగా ఆకాశం నుంచి పడుతున్న మెటల్ బాల్స్…!! భయాందోళనలో స్థానికులు
9China Media: అరుదైన ఘటనలో భారత ప్రభుత్వాన్ని వెనకేసుకొచ్చిన చైనా జాతీయ మీడియా
10karimnagar : కరీంనగర్లో బాంబు కలకలం
-
Small Mistakes : మీరు చేసే చిన్నచిన్న పొరపాట్లే అనారోగ్యాలకు దారితీస్తాయ్!
-
After Eating : భోజనం చేసిన వెంటనే పొరపాటున కూడా ఇలా చేయెద్దు!
-
PM Modi in Nepal: సరిహద్దు వివాదం అనంతరం మొదటిసారి నేపాల్‌లో పర్యటించిన ప్రధాని మోదీ
-
Covid Relief Fund: పొరబాటున వ్యక్తి అకౌంట్లో రూ. 2.77కోట్ల కొవిడ్ రిలీఫ్ ఫండ్
-
Omicron Anti-bodies: బూస్టర్ డోసు కంటే ఓమిక్రాన్ సంక్రమణతో పెరిగిన రోగ నిరోధక శక్తి: పరిశోధకులు
-
Lotus Nuts : హై బీపీ నియంత్రించి, బరువు తగ్గేలా చేసే తామర గింజలు!
-
Rahul Gandhi: దేశ ఆర్ధిక వ్యవస్థను బీజేపీ నాశనం చేసింది: రాహుల్ గాంధీ విసుర్లు
-
Taj Mahal: తాజ్ మహల్ 22 గదుల చిత్రాలను విడుదల చేసిన పురావస్తుశాఖ అధికారులు: గదుల్లో ఏముందంటే!