IND vs SA: సెంచరీతో అదరగొట్టిన తెలుగు కుర్రాడు తిలక్ వర్మ.. పోరాడి ఓడిన దక్షిణాఫ్రికా

భారత్ వర్సెస్ సౌతాఫ్రికా జట్ల మధ్య బుధవారం రాత్రి మూడో టీ20 మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో 11 పరుగుల తేడాతో టీమిండియా విజయం సాధించింది.

Tilak Varma

IND vs SA 3rd T20: భారత్ వర్సెస్ సౌతాఫ్రికా జట్ల మధ్య బుధవారం రాత్రి మూడో టీ20 మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో 11 పరుగుల తేడాతో టీమిండియా విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు భారీ స్కోరు సాధించింది. తెలుగు కుర్రాడు తిలక్ వర్మ బ్యాట్ తో అదరగొట్టాడు. సిక్సులు, ఫోర్లతో సౌతాఫ్రికా బౌలర్లపై విరుచుకు పడ్డాడు. దీంతో 56 బంతుల్లోనే 107 పరుగులు చేశాడు. ఇందులో ఎనిమిది ఫోర్లు, ఏడు సిక్సులు ఉండటం విశేషం. మరోవైపు అభిషేక్ దూకుడైన బ్యాటింగ్ తో స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది. అభిషేక్ కేవలం 25 బంతుల్లోనే 50 పరుగులు చేశాడు. ఇందులో ఐదు సిక్సులు, మూడు ఫోర్లు ఉన్నాయి. వీరిద్దరి దూకుడైన బ్యాటింగ్ తో భారత్ జట్టు నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 219 పరుగులు చేసింది.

Also Read: Arjun Tendulkar : ఐపీఎల్ మెగా వేలానికి ముందు.. స‌త్తా చాటిన స‌చిన్ కొడుకు అర్జున్ టెండూల్క‌ర్‌..

భారీ స్కోర్ లక్ష్య చేధనలో భాగంగా తొలుత దక్షిణాఫ్రికా బ్యాటర్లు వరుసగా పెవిలియన్ బాటపట్టారు. చివరిలో క్లాసెన్, యాన్సెన్ దూకుడైన బ్యాటింగ్ భారత్ ను కలవరపెట్టింది. 15 ఓవర్లకు దక్షిణాఫ్రికా జట్టు నాలుగు వికెట్లు కోల్పోయి 134 పరుగులు చేసింది. చివరి ఐదు ఓవర్లలో 86 పరుగులు చేయాల్సి ఉంది.. హెన్రిచ్ క్లాసెన్ 22 బంతుల్లో 41 పరుగులు, మార్కో యాన్సెన్ 17 బంతుల్లో 54 పరుగులతో సుడిగాలి ఇన్నింగ్స్ ఆడారు. దీంతో మ్యాచ్ చేజారిపోతుందన్న ఆందోళన వ్యక్తమైంది. 18వ ఓవర్లో అర్ష్దీప్ ప్రమాదకరమైన క్లాసెన్ ను ఔట్ చేశాడు.

Also Read: IND vs AUS Test: ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్.. రెండో టెస్టుకూ రోహిత్ శర్మ దూరం? ఎందుకంటే..

చివరి ఓవర్లో దక్షిణాఫ్రికా జట్టు 25 పరుగులు చేయాల్సి ఉండగా.. యాన్సెన్ క్రీజులో ఉన్నాడు. అర్ష్ దీప్ బౌలింగ్ వేయగా.. రెండో బంతికి యాన్సెన్ సిక్స్ కొట్టాడు. మూడో బంతికి ఔట్ కావటంతో భారత్ ఊపీరిపీల్చుకుంది. నిర్ణీత ఓవర్లలో దక్షిణాఫ్రికా జట్టు ఏడు వికెట్లు కోల్పోయి 208 పరుగులు చేసింది. దీంతో భారత్ జట్టు 11 పరుగుల తేడాతో విజయం సాధించింది. నాలుగు టీ20 మ్యాచ్ ల సిరీస్ లో భారత్ జట్టు 2-1తో ఆధిక్యంలోకి వెళ్లింది. చివరి టీ20 మ్యాచ్ శుక్రవారం జరుగుతుంది.