Arjun Tendulkar : ఐపీఎల్ మెగా వేలానికి ముందు.. స‌త్తా చాటిన స‌చిన్ కొడుకు అర్జున్ టెండూల్క‌ర్‌..

టీమ్ఇండియా దిగ్గ‌జ ఆట‌గాడు స‌చిన్ టెండూల్క‌ర్ కొడుకు అర్జున్ టెండూల్క‌ర్ మ‌రోసారి స‌త్తా చాటాడు.

Arjun Tendulkar : ఐపీఎల్ మెగా వేలానికి ముందు.. స‌త్తా చాటిన స‌చిన్ కొడుకు అర్జున్ టెండూల్క‌ర్‌..

Arjun delivers perfect IPL mega auction audition bags maiden Ranji 5 fer

Updated On : November 13, 2024 / 3:14 PM IST

టీమ్ఇండియా దిగ్గ‌జ ఆట‌గాడు స‌చిన్ టెండూల్క‌ర్ కొడుకు అర్జున్ టెండూల్క‌ర్ మ‌రోసారి స‌త్తా చాటాడు. ప్ర‌స్తుతం రంజీ ట్రోఫీలో గోవా త‌రుపున బ‌రిలోకి దిగాడు. గోవా క్రికెట్ అసోసియేషన్ అకాడమీ గ్రౌండ్‌లో అరుణాచల్ ప్రదేశ్‌తో బుధవారం జరిగిన రంజీ ట్రోఫీ ప్లేట్ డివిజన్ మ్యాచ్‌లో పేస‌ర్ అర్జున్ టెండూల్కర్ ఐదు వికెట్లు సాధించాడు. కాగా.. ఫ‌స్ట్ క్లాస్ క్రికెట్‌లో అర్జున్‌కు ఇదే మొద‌టి ఐదు వికెట్ల ప్ర‌ద‌ర్శ‌న. అర్జున్ కెరీర్‌లో ఇది 17వ ఫ‌స్ట్‌క్లాస్ మ్యాచ్‌.

ఈ మ్యాచ్‌లో 9 ఓవ‌ర్లు వేసిన అర్జున్ 25 ప‌రుగులు ఇచ్చి 5 వికెట్లు సాధించాడు. ఇందులో మూడు మెయిడిన్ ఓవ‌ర్లు ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన అరుణాచ‌ల్ ప్ర‌దేశ్ బ్యాటింగ్ ఎంచుకుంది. రెండో ఓవ‌ర్‌లోనే ఓపెన‌ర్ న‌బ‌మ్ హ‌చాంగ్‌ను అర్జున్ క్లీన్ బౌల్డ్ చేసి వికెట్ల ప‌తాన్ని మొద‌లు పెట్టాడు. అర్జున్‌తో పాటు మోహిత్ రెడ్కర్ (3/15), కీత్ మార్క్ పింటో (2/31)లు రాణించ‌డంతో అరుణాచ‌ల్ ప్ర‌దేశ్ త‌న తొలి ఇన్నింగ్స్‌లో 30.3 ఓవ‌ర్ల‌లో 84 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది.

IND vs AUS Test: ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్.. రెండో టెస్టుకూ రోహిత్ శర్మ దూరం? ఎందుకంటే..

ఈ మ్యాచ్‌కు ముందు అర్జున్ 16 ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లలో 32 వికెట్లు తీశాడు. అతని మునుపటి బెస్ట్ 4/49. ఇక బ్యాటింగ్‌లో 23.13 స‌గ‌టుతో 532 ప‌రుగులు చేశాడు. ఇందులో ఓ సెంచ‌రీ, ఓ అర్థసెంచ‌రీ ఉంది.

మెగా వేలానికి ముందు..
అర్జున్ టెండూల్క‌ర్ ఇప్ప‌టి వ‌ర‌కు ఐపీఎల్ లో 5 మ్యాచులు ఆడాడు. కేవ‌లం మూడు వికెట్లు మాత్ర‌మే తీశాడు. ఈ మ్యాచ్‌లు మొత్తం ముంబై ఇండియ‌న్స్ త‌రుపున ఆడాడు. మెగా వేలం జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో ముంబై అర్జున్‌ను విడిచిపెట్టింది. ఈ నెల 24, 25న మెగా వేలం జ‌ర‌గ‌నుంది. ఈ క్ర‌మంలో మెగా వేలానికి ముందు త‌న స‌త్తా ఏమిటో అర్జున్ చూపించాడు. దీంతో అత‌డిని ఏదైన ప్రాంఛైజీ సొంతం చేసుకుంటుందో లేదో మ‌రీ.

AUS vs IND : గంభీర్ వ్యాఖ్య‌ల‌పై స్పందించిన రికీ పాంటింగ్‌.. కోహ్లీ గురించి ఏమ‌న్నాడంటే?