×
Ad

Sanju Samson : సంజూ శాంస‌న్ అరుదైన‌ ఘ‌న‌త‌.. 10 ఏళ్లు ప‌ట్టింది.. ఏడాదికి ఓ వంద‌..

టీమ్ఇండియా వికెట్ కీప‌ర్ బ్యాట‌ర్ సంజూ శాంస‌న్ (Sanju Samson) అరుదైన ఘ‌నత సాధించాడు.

IND vs SA 5th T20 Sanju Samson complete 1000 international t20 runs

Sanju Samson : టీమ్ఇండియా వికెట్ కీప‌ర్ బ్యాట‌ర్ సంజూ శాంస‌న్ అరుదైన ఘ‌నత సాధించాడు. అంత‌ర్జాతీ టీ20 క్రికెట్‌లో 1000 ప‌రుగుల మైలురాయిని పూర్తి చేసుకున్నాడు. అహ్మ‌దాబాద్‌లోని న‌రేంద్ర‌మోదీ స్టేడియంలో జ‌రిగిన ఐదో టీ20 మ్యాచ్‌లో వ్య‌క్తిగ‌త స్కోరు 5 ప‌రుగుల వ‌ద్ద అత‌డు ఈ మైలురాయిని చేరుకున్నాడు.

అంత‌ర్జాతీయ టీ20 క్రికెట్‌లో 1000 ప‌రుగులు పూర్తి చేసుకున్న 14వ భార‌త ప్లేయ‌ర్‌గా రికార్డుల్లోకి ఎక్కాడు. రోహిత్ శ‌ర్మ‌, విరాట్ కోహ్లీ, సూర్య‌కుమార్ యాద‌వ్‌, కేఎల్ రాహుల్‌, హార్దిక్ పాండ్యా, శిఖ‌ర్ ధావ‌న్, ఎంఎస్ ధోని, సురేశ్ రైనా, రిష‌బ్ పంత్, యువ‌రాజ్ సింగ్‌, తిల‌క్ వ‌ర్మ‌, శ్రేయ‌స్ అయ్య‌ర్ , అభిషేక్ శ‌ర్మ లు అత‌డి క‌న్నా ముందు ఉన్నారు.

ఇక ఈ మ్యాచ్‌లో సంజూ శాంస‌న్ 22 బంతులు ఎదుర్కొని 4 ఫోర్లు, 2 సిక్స‌ర్ల సాయంతో 37 ప‌రుగులు సాధించాడు.

Ravichandran Ashwin : మ్యాచ్ లే స్టార్ట్ కాలేదు.. అప్పుడే టాప్ 4 అంట..

2015లో అంత‌ర్జాతీయ టీ20 క్రికెట్‌లో అడుగుపెట్టిన సంజూ శాంస‌న్ ఇప్ప‌టి వ‌ర‌కు 52 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. 44 ఇన్నింగ్స్‌ల్లో 25.8 స‌గ‌టుతో 1032 ప‌రుగులు చేశాడు. ఇందులో 3 సెంచ‌రీలు, 3 అర్థ‌శ‌త‌కాలు ఉన్నాయి.

ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భార‌త్ 5 వికెట్ల న‌ష్టానికి 231 ప‌రుగులు చేసింది. టీమ్ఇండియా బ్యాట‌ర్ల‌లో తిల‌క్ వ‌ర్మ (73; 42 బంతుల్లో 10 ఫోర్లు, 1 సిక్స్‌), హార్దిక్ పాండ్యా (63;25 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్స‌ర్లు)మెరుపు అర్థ‌శ‌త‌కాలు సాధించారు. సంజూ శాంస‌న్ (37), అభిషేక్ శ‌ర్మ (34) లు రాణించారు. సౌతాఫ్రికా బౌల‌ర్ల‌లో కార్బిన్ బోష్ రెండు వికెట్లు తీశాడు. ఒట్నీల్ బార్ట్‌మాన్, జార్జ్ లిండే లు త‌లా ఓ వికెట్ తీశారు.

Smriti Mandhana : పెళ్లి ర‌ద్దు త‌రువాత‌.. తెల్ల‌టి డ్రెస్‌లో దేవ‌క‌న్య‌లా మెరిసిపోతున్న స్మృతి మంధాన‌..

అనంత‌రం క్వింట‌న్ డికాక్ (65; 35 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స‌ర్లు) హాఫ్ సెంచ‌రీ చేయ‌గా డెవాల్డ్ బ్రెవిస్ (31; 17 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స‌ర్లు) రాణించిన‌ప్ప‌టికి కూడా నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో దక్షిణాఫ్రికా 8 వికెట్ల న‌ష్టానికి 201 ప‌రుగుల‌కే ప‌రిమిత‌మైంది. దీంతో భార‌త్ 30 ప‌రుగుల తేడాతో విజ‌యం సాధించింది. భార‌త బౌల‌ర్ల‌లో వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి నాలుగు వికెట్లు తీశాడు. జ‌స్‌ప్రీత్ బుమ్రా రెండు వికెట్లు ప‌డ‌గొట్టారు. అర్ష్‌దీప్ సింగ్‌, హార్దిక్ పాండ్యాలు త‌లా ఓ వికెట్ సాధించారు.