IND vs SA South Africa announce Test squad for India series
IND vs SA : దక్షిణాఫ్రికా జట్టు నవంబర్‌లో భారత పర్యటనకు రానుంది. ఆతిథ్య భారత్‌తో సఫారీలు రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. నవంబర్ 14 నుంచి కోల్‌కతా వేదికగా ప్రారంభం కానున్న తొలి టెస్టు మ్యాచ్‌తో పర్యటన ప్రారంభం కానుంది.
ఈ క్రమంలో రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్‌తో తలపడే దక్షిణాఫ్రికా జట్టును ప్రకటించారు. 15 మంది సభ్యులతో కూడిన జట్టును దక్షిణాప్రికా క్రికెట్ బోర్డు ప్రకటించింది. గాయం కారణంగా పాకిస్తాన్‌తో సిరీస్‌కు దూరంగా ఉన్న కెప్టెన్ టెంబా బవుమా తిరిగి జట్టులో చేరాడు. అతడి సారథ్యంలో సఫారీలు భారత్‌తో తలపడనున్నారు.
Pratika Rawal ruled out : భారత్‌కు భారీ షాక్.. ప్రపంచకప్ నుంచి తప్పుకున్న ప్రతీకా రావల్
🚨 SQUAD ANNOUNCEMENT 🚨
The South African Men’s selection panel has announced the 15-player squad for the two-match Test series against India from 14 – 26 November in the subcontinent.
Test captain Temba Bavuma returns to the side after missing the recent Pakistan Test series… pic.twitter.com/dOGTELaXUu
— Proteas Men (@ProteasMenCSA) October 27, 2025
పాక్‌తో సిరీస్‌లో ఆడిన చాలా మంది ఆటగాళ్లను భారత పర్యటన కోసం ఎంపిక చేశారు.
భారత్‌తో టెస్టు సిరీస్ కోసం దక్షిణాఫ్రికా టెస్టు జట్టు ఇదే..
టెంబా బావుమా (కెప్టెన్), కార్బిన్ బాష్, డెవాల్డ్ బ్రెవిస్, టోనీ డి జోర్జి, జుబేర్ హంజా, సైమన్ హర్మర్, మార్కో యాన్సెన్, కేశవ్ మహరాజ్, ఐడెన్ మార్‌క్రమ్, వియాన్ ముల్డర్, సెనురన్ ముత్తుసామి, కగిసో రబాడ, ర్యాన్ రికెల్‌టన్, ట్రిస్టన్ స్టబ్స్, కైల్ వెరినె.
టెస్టు సిరీస్ షెడ్యూల్ ఇదే..
* తొలి టెస్టు మ్యాచ్ – నవంబర్ 14 నుంచి 18 వరకు (కోల్‌కతా వేదికగా)
* రెండో టెస్టు మ్యాచ్ – నవంబర్ 22 నుంచి 26 వరకు (గువాహటి)