Pratika Rawal ruled out : భార‌త్‌కు భారీ షాక్.. ప్ర‌పంచ‌క‌ప్ నుంచి త‌ప్పుకున్న ప్ర‌తీకా రావ‌ల్‌

మ‌హిళ‌ల వ‌న్డే ప్ర‌పంచ‌కప్ 2025 నుంచి స్టార్ ఓపెన‌ర్ ప్ర‌తీకా రావ‌ల్ త‌ప్పుకుంది (Pratika Rawal ruled out).

Pratika Rawal ruled out : భార‌త్‌కు భారీ షాక్.. ప్ర‌పంచ‌క‌ప్ నుంచి త‌ప్పుకున్న ప్ర‌తీకా రావ‌ల్‌

Pratika Rawal ruled out of the Womens World Cup 2025

Updated On : October 27, 2025 / 3:07 PM IST

Pratika Rawal ruled out : మ‌హిళ‌ల వ‌న్డే ప్ర‌పంచ‌కప్ 2025లో భార‌త్‌కు భారీ షాక్ త‌గిలింది. ఆస్ట్రేలియాతో సెమీఫైన‌ల్ మ్యాచ్‌కు ముందు స్టార్ ఓపెన‌ర్ ప్ర‌తీకా రావ‌ల్ ఈ టోర్న‌మెంట్ నుంచి త‌ప్పుకుంది. బంగ్లాదేశ్‌తో జ‌రిగిన చివ‌రి లీగ్ మ్యాచ్‌లో ఆమె చీల‌మండ‌లానికి గాయ‌మైన సంగ‌తి తెలిసిందే.

న‌వీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో ఆదివారం భార‌త్‌, బంగ్లాదేశ్ జ‌ట్లు త‌ల‌ప‌డ్డాయి. ఈ మ్యాచ్‌కు వ‌రుణుడు అంత‌రాయం క‌లిగించాడు. దీంతో మ్యాచ్‌ను 29 ఓవ‌ర్ల‌కు కుదించారు. బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ 21 వ ఓవ‌ర్‌ లో ఓ బంతిని ఆపే క్ర‌మంలో ప్ర‌తీకా రావ‌ల్ గాయ‌ప‌డింది. మైదానం చిత్తడిగా ఉండ‌డంతో ర‌న్నింగ్‌లో బంతిని ఆపే క్ర‌మంలో ఆమె కుడికాలు మ‌డిమ మ‌డ‌త‌ప‌డింది. దీంతో తీవ్ర‌మైన నొప్పితో ఆమె మైదానాన్ని వీడింది. బ్యాటింగ్‌కు కూడా రాలేదు. దీంతో ఆమె స్థానంలో అమ‌న్ జ్యోత్ కౌర్ ఇన్నింగ్స్ ఆరంభించింది. అయితే.. వ‌ర్షం కార‌ణంగా ఈ మ్యాచ్ ర‌ద్దైంది.

Prithvi Shaw : వామ్మో పృథ్వీ షా.. ఏం కొట్టుడు అదీ.. 29 ఫోర్లు, 5 సిక్స‌ర్లు.. సెకండ్ ఫాస్టెస్ట్ డ‌బుల్ సెంచ‌రీ

డిసెంబ‌ర్ 2024లో అంత‌ర్జాతీయ వ‌న్డే క్రికెట్‌లో ప్ర‌తీకా రావ‌ల్ అరంగ్రేటం చేసింది. మ‌హిళ‌ల వ‌న్డేల్లో అత్యంత వేగంగా 1000 ప‌రుగులు చేసిన రెండో ప్లేయ‌ర్‌గా రికార్డుల‌కు ఎక్కింది. ఇక వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో అద్భుతంగా ఆడుతోంది. న్యూజిలాండ్‌తో జ‌రిగిన చివ‌రి మ్యాచ్‌లో ఆమె సెంచ‌రీ సాధించింది. మ‌రో ఓపెన‌ర్ స్మృతి మంధానతో క‌లిసి జ‌ట్టును అద్భుత ఆరంభాల‌ను ఇస్తోంది.

Virat kohli-Rohit Sharma : వార్నీ మ‌ళ్లీ రోహిత్, కోహ్లీల‌ను మైదానంలో చూడాలంటే అన్ని రోజులు ఆగాలా?

ఇదిలా ఉంటే.. వికెట్ కీప‌ర్ బ్యాట‌ర్ రిచా ఘోష్ కూడా ఆసీస్‌తో సెమీఫైన‌ల్ ఆడ‌డం అనుమానంగానే ఉంది. కివీస్‌తో మ్యాచ్‌లో రిచా వేలికి గాయ‌మైంది. దీంతో ఆమెకు బంగ్లాదేశ్‌తో జ‌రిగిన మ్యాచ్‌కు విశ్రాంతి ఇచ్చారు. రిచా కూడా ఆడ‌కుంటే గురువారం (అక్టోబ‌ర్ 30న‌) ఆస్ట్రేలియాతో జ‌ర‌గ‌నున్న సెమీఫైన‌ల్ మ్యాచ్‌లో భార‌త్‌కు ఇబ్బందులు త‌ప్ప‌క‌పోవ‌చ్చు.