Virat kohli-Rohit Sharma : వార్నీ మ‌ళ్లీ రోహిత్, కోహ్లీల‌ను మైదానంలో చూడాలంటే అన్ని రోజులు ఆగాలా?

ఆసీస్‌తో వ‌న్డే సిరీస్ ముగియ‌డంతో మ‌ళ్లీ రోహిత్ శ‌ర్మ‌, విరాట్ కోహ్లీలు (Virat kohli-Rohit Sharma) ఎప్పుడు భార‌త జెర్సీలో క‌నిపిస్తారా అని ఫ్యాన్స్ ఆరా తీస్తున్నారు.

Virat kohli-Rohit Sharma : వార్నీ మ‌ళ్లీ రోహిత్, కోహ్లీల‌ను మైదానంలో చూడాలంటే అన్ని రోజులు ఆగాలా?

Do you know When will Virat kohli and Rohit Sharma play next match for India

Updated On : October 27, 2025 / 1:00 PM IST

Virat kohli-Rohit Sharma : భార‌త్‌, ఆస్ట్రేలియా జ‌ట్ల మ‌ధ్య వ‌న్డే సిరీస్ ముగిసింది. బుధ‌వారం (అక్టోబ‌ర్ 29) నుంచి ఇరు జ‌ట్ల మ‌ధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. అయితే.. పొట్టి ఫార్మాట్‌కు సీనియ‌ర్ ఆట‌గాళ్లు రోహిత్ శ‌ర్మ‌, విరాట్ కోహ్లీలు రిటైర్‌మెంట్ ప్ర‌క‌టించ‌డంతో ఈ సిరీస్‌లో ఆడ‌రు. ఈ క్ర‌మంలోనే వీరిద్ద‌రు స్వ‌దేశానికి వ‌చ్చేస్తున్నారు. కాగా.. మ‌రోసారి ఈ ఇద్ద‌రు (Virat kohli-Rohit Sharma) ఎప్పుడు భార‌త జెర్సీలో క‌నిపిస్తారా? అని అభిమానులు ఆరా తీస్తున్నారు.

ఆసీస్‌తో మూడు మ్యాచ్‌ల వ‌న్డే సిరీస్‌లో రోహిత్ శ‌ర్మ అద‌ర‌గొట్టాడు. తొలి మ్యాచ్‌లో విప‌ల‌మైన‌ప్ప‌టికి కూడా ఆ త‌రువాత రెండు మ్యాచ్‌ల్లో త‌న స‌త్తా ఏమిటో చూపాడు. రెండో వ‌న్డేలో హాఫ్ సెంచ‌రీ చేయ‌గా, ఆఖ‌రి మ్యాచ్‌లో అజేయ సెంచ‌రీతో క‌దం తొక్కాడు. ఇక కోహ్లీ విష‌యానికి వ‌స్తే.. తొలి రెండు మ్యాచ్‌ల్లో డ‌కౌట్ అయిన ఈ ప‌రుగుల యంత్రం ఆఖ‌రి వ‌న్డే మ్యాచ్‌లో అజేయ అర్థ‌శ‌త‌కంతో స‌త్తా చాటాడు.

Shreyas Iyer : ఎంత ప‌నాయో.. అద్భుత క్యాచ్ అందుకుని.. ఐసీయూలో శ్రేయ‌స్ అయ్య‌ర్‌..! అంత‌ర్గ‌త ర‌క్త‌స్రావం..!

ఆసీస్ గ‌డ్డ‌పై అద‌ర‌గొట్టిన రో-కో ద్వ‌యం.. స్వ‌దేశంలో ద‌క్షిణాఫ్రికాతో జ‌రిగే మూడు వ‌న్డేల సిరీస్‌లో మ‌ళ్లీ రీఎంట్రీ ఇవ్వ‌నున్నారు. న‌వంబ‌ర్ 30 నుంచి భార‌త్‌, దక్షిణాఫ్రికాల మ‌ధ్య మూడు మ్యాచ్‌ల వ‌న్డే సిరీస్ ప్రారంభం కానుంది. రాంచీ వేదిక‌గా నవంబ‌ర్ 30న తొలి వ‌న్డే, రాయ్‌పూర్ వేదిక‌గా డిసెంబ‌ర్ 3న రెండో వ‌న్డే, వైజాగ్ వేదిక‌గా డిసెంబ‌ర్ 6న మూడో వ‌న్డే మ్యాచ్ జ‌ర‌గ‌నుంది.

భార‌త్‌-ఏ త‌రుపున ఆడ‌తారా?

ద‌క్షిణాఫ్రికాతో సిరీస్ క‌న్నా ముందే రో-కో ద్వ‌యం మైదానంలో క‌నిపించే అవ‌కాశం ఉంది. స‌ఫారీ సిరీస్ కన్నా ముందే ద‌క్షిణాఫ్రికా-ఏతో జ‌రిగే మూడు మ్యాచ్‌ల అన‌ధికారిక వ‌న్డే సిరీస్‌లో ఆడే అవ‌కాశం ఉంది. న‌వంబ‌ర్ 13 నుంచి సౌతాఫ్రికా-ఏతో భార‌త్‌-ఏ త‌ల‌ప‌డ‌నుంది.