×
Ad

IND vs SA : ద‌క్షిణాఫ్రికాతో తొలి టీ20 మ్యాచ్‌.. సూర్య‌కుమార్ యాద‌వ్ చ‌రిత్ర సృష్టించేనా?

భార‌త్‌, ద‌క్షిణాఫ్రికా జ‌ట్ల మ‌ధ్య (IND vs SA) మంగ‌ళ‌వారం క‌ట‌క్ వేదిక‌గా తొలి టీ20 మ్యాచ్ జ‌ర‌గ‌నుంది.

IND vs SA Suryakumar Yadav needs 58 runs tp create history against south africa in T20

IND vs SA : ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా భార‌త్‌, ద‌క్షిణాఫ్రికా జ‌ట్ల మ‌ధ్య మంగ‌ళ‌వారం క‌ట‌క్ వేదిక‌గా తొలి టీ20 మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. ఈ మ్యాచ్‌కు ముందు టీమ్ఇండియా టీ20 కెప్టెన్ సూర్య‌కుమార్ యాద‌వ్‌ను ఓ అరుదైన ఘ‌న‌త ఊరిస్తోంది. ఈ మ్యాచ్‌లో సూర్య 58 ప‌రుగులు చేస్తే ద‌క్షిణాఫ్రికా జ‌ట్టుపై టీ20ల్లో అత్య‌ధిక ప‌రుగులు చేసిన భార‌త ప్లేయ‌ర్‌గా చ‌రిత్ర సృష్టిస్తాడు. ఈ క్ర‌మంలో స్టార్ ఆట‌గాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శ‌ర్మ‌ల‌ను అధిగ‌మిస్తాడు.

ద‌క్షిణాఫ్రికా పై టీ20ల్లో అత్య‌ధిక ప‌రుగులు చేసిన భార‌త ఆట‌గాళ్ల‌లో టీమ్ఇండియా మాజీ కెప్టెన్ రోహిత్ శ‌ర్మ అగ్ర‌స్థానంలో ఉన్నాడు. హిట్‌మ్యాన్ 17 ఇన్నింగ్స్‌లలో 26.81 సగటుతో 429 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీ, రెండు అర్ధ సెంచరీలు ఉన్నాయి.

IND vs SA : ద‌క్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌కు ముందు టీమ్ఇండియాకు ఐసీసీ షాక్‌.. భారీ జ‌రిమానా..

ఇక విరాట్ కోహ్లీ 13 ఇన్నింగ్స్‌ల్లో 39.40 స‌గ‌టుతో 394 ప‌రుగులు చేశాడు. ఇందులో మూడు అర్థ‌శ‌త‌కాలు ఉన్నాయి. సూర్య‌కుమార్ యాద‌వ్ ఇప్ప‌టి వ‌ర‌కు సౌతాఫ్రికాతో పై టీ20ల్లో 10 ఇన్నింగ్స్‌ల్లో 41.33 సగటుతో 372 పరుగులు చేశాడు. ఇందులో ఓ శ‌త‌కం, నాలుగు అర్థ‌శ‌త‌కాలు ఉన్నాయి.

ఇక ఓవ‌రాల్‌గా ఇంగ్లాండ్‌కు చెందిన జోస్ బట్లర్ ద‌క్షిణాప్రికా పై టీ20ల్లో అత్య‌ధిక ప‌రుగులు చేసిన ఆట‌గాళ్ల జాబితాలో అగ్ర‌స్థానంలో ఉన్నాడు. బ‌ట్ల‌ర్ 21 ఇన్నింగ్స్‌లలో 606 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు అర్థ‌శ‌త‌కాలు ఉన్నాయి.

IND vs SA : మంగ‌ళ‌వారం నుంచే టీ20 సిరీస్‌.. ఫ్రీగా ఎక్క‌డ చూడొచ్చొ తెలుసా?

ఫామ్‌లో లేని సూర్య‌..

అయితే ఈ ఏడాది సూర్య‌కుమార్ యాద‌వ్ పెద్ద‌గా ఫామ్‌లో లేడు. ఈ ఏడాదిలో ఇప్ప‌టి వ‌ర‌కు 15 ఇన్నింగ్స్‌లలో అతను 15.33 సగటు 127.77 స్ట్రైక్ రేట్‌తో 184 పరుగులు మాత్ర‌మే చేశాడు. అత్యధిక స్కోరు 47 నాటౌట్.