IND vs SA : దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌కు ముందు టీమ్ఇండియాకు ఐసీసీ షాక్.. భారీ జరిమానా..
భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య (IND vs SA) మంగళవారం (డిసెంబర్ 9) నుంచి ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ప్రారంభం కానుంది.
ICC fined to India for slow overrate in 2nd ODI against South Africa
IND vs SA : భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య మంగళవారం (డిసెంబర్ 9) నుంచి ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. కాగా.. ఈ సిరీస్ ప్రారంభానికి ముందు టీమ్ఇండియాకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) భారీ షాక్ ఇచ్చింది. టీమ్ఇండియా ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో 10 శాతం జరిమానాగా విధించింది.
అసలేం జరిగిందంటే..?
భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ జరిగింది. ఈ సిరీస్‌లో భాగంగా రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో భారత జట్టు నిర్ణీత సమయంలో తన ఓవర్ల కోటాను పూర్తి చేయలేకపోయింది. స్లో ఓవర్ రేటును నమోదు చేసినందుకు గాను ఐసీసీ చర్యలు తీసుకుంది.
India fined for breach of ICC Code of Conduct against South Africa 👀https://t.co/CZO3nv5rcR
— ICC (@ICC) December 8, 2025
నిర్ణీత సమయానికి భారత్ రెండు ఓవర్లను తక్కువగా వేసినట్లు ఐసీసీ తెలిపింది. నిబంధనల ప్రకారం ఒక్కొ ఓవర్‌కు 5 శాతం చొప్పున మొత్తం రెండు ఓవర్లకు గానూ 10 శాతం ఫైన్ పడింది. ఐసీసీ ఎలైట్ ప్యానెల్ మ్యాచ్ రిఫరీ రిచీ రిచర్డ్సన్ ఈ శిక్షను ఖరారు చేశారు.
కాగా.. చేసిన తప్పును, విధించిన శిక్షను టీమ్ఇండియా కెప్టెన్ కేఎల్ రాహుల్ అంగీకరించాడని, ఇక దీనిపై ఎలాంటి తదుపరి విచారణ ఉండదని ఐసీసీ ఓ ప్రకటనలో తెలిపింది.
IND vs SA : దక్షిణాఫ్రికాతో తొలి టీ20 మ్యాచ్.. అరుదైన రికార్డుపై తిలక్ వర్మ కన్ను..
ఇదిలా ఉంటే.. వన్డే సిరీస్‌ను భారత్ 2-1తో కైవసం చేసుకుంది. మంగళవారం నుంచి ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌కు కటక్ ఆతిథ్యం ఇవ్వనుంది.
