IND vs SA : తొలి టీ20కి ముందు సూర్య కుమార్ యాద‌వ్ కామెంట్స్.. త‌గిన‌న్ని అవ‌కాశాలు ఇచ్చాము.. ఓపెన‌ర్ అత‌డే.. ఆ ఇద్ద‌రు ఫిట్‌..

ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా మంగ‌ళ‌వారం క‌ట‌క్ వేదిక‌గా భార‌త్‌, ద‌క్షిణాఫ్రికా జ‌ట్ల మ‌ధ్య (IND vs SA ) తొలి టీ20 మ్యాచ్ జ‌ర‌గ‌నుంది

IND vs SA : తొలి టీ20కి ముందు సూర్య కుమార్ యాద‌వ్ కామెంట్స్.. త‌గిన‌న్ని అవ‌కాశాలు ఇచ్చాము.. ఓపెన‌ర్ అత‌డే.. ఆ ఇద్ద‌రు ఫిట్‌..

Suryakumar Yadav key comments ahead of IND vs SA 1st T20

Updated On : December 8, 2025 / 3:56 PM IST

IND vs SA : ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా మంగ‌ళ‌వారం క‌ట‌క్ వేదిక‌గా భార‌త్‌, ద‌క్షిణాఫ్రికా జ‌ట్ల మ‌ధ్య తొలి టీ20 మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. ఈ మ్యాచ్‌కు ముందు టీమ్ఇండియా టీ20 కెప్టెన్ సూర్య‌కుమార్ యాద‌వ్ మీడియా స‌మావేశంలో పాల్గొన్నాడు. ఈ క్ర‌మంలో ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు.

గాయాల‌తో దూర‌మైన ఆల్‌రౌండ‌ర్ హార్దిక్ పాండ్యా, వైస్ కెప్టెన్ శుభ్‌మ‌న్ గిల్ లు పూర్తి ఫిట్‌నెస్ సాధించార‌ని చెప్పారు. వారిద్ద‌రు జ‌ట్టులో చేర‌డం సంతోషంగా ఉంద‌న్నాడు. హార్దిక్ రావ‌డంతో జ‌ట్టుకు స‌మ‌తుల్యం వ‌చ్చింద‌న్నాడు.

IND vs SA : దక్షిణాఫ్రికాతో తొలి టీ20 మ్యాచ్‌.. అరుదైన రికార్డుపై తిల‌క్ వ‌ర్మ క‌న్ను..

అత‌డి అనుభ‌వం జ‌ట్టుకు ఎంతో ఉప‌యోగ‌ప‌డుతుంద‌న్నాడు. ఆసియాక‌ప్‌లో బౌలింగ్ దాడిని పాండ్యా ప్రారంభించిన సంగ‌తి తెలిసిందే. దీనిపై మాట్లాడుతూ.. అత‌డు అలా చేయ‌డం వ‌ల్ల త‌మ‌కు ఆప్ష‌న్లు ఇంకా పెరిగాయ‌న్నాడు.

విధ్వంస‌క‌ర ఆట‌గాడు అభిషేక్ శ‌ర్మ‌తో క‌లిసి శుభ్‌మ‌న్ గిల్ ఓపెనింగ్ చేస్తాడ‌ని చెప్పుకొచ్చాడు. శ్రీలంక‌తో జ‌రిగిన సిరీస్‌లో శుభ్‌మ‌న్ గిల్ ఓపెన‌ర్‌గా వ‌చ్చాడు. ఆ త‌రువాత అత‌డు దూర‌మైన స‌మ‌యంలో సంజూ శాంస‌న్ ఓపెన‌ర్‌గా వ‌చ్చి అద్భుతంగా రాణించాడు. ఇప్పుడు గిల్ తిరిగి జ‌ట్టులోకి వ‌చ్చాడు. కాబ‌ట్టి అత‌డి స్థానాన్ని అత‌డికే ఇవ్వ‌డం స‌రైంది అని అన్నాడు.

IND vs SA : మంగ‌ళ‌వారం నుంచే టీ20 సిరీస్‌.. ఫ్రీగా ఎక్క‌డ చూడొచ్చొ తెలుసా?

సంజూ శాంస‌న్ ఎంతో విలువైన ఆట‌గాడు అని, అత‌డు ఏ స్థానంలోనైనా బ్యాటింగ్ చేయ‌గ‌ల స‌మ‌ర్థుడ‌ని చెప్పుకొచ్చాడు. ఓపెన‌ర్లు మిన‌హా మిగిలిన బ్యాటింగ్ ఆర్డ‌ర్‌లో మార్పులు ఉంటాయ‌న్నాడు. ప‌రిస్థితుల‌ను బ‌ట్టి ప్లేయ‌ర్లు మూడో స్థానం నుంచి ఏ స్థానంలోనైనా బ్యాటింగ్ చేయ‌డానికి సిద్ధంగా ఉండాల‌ని సూచించాడు.