Ind Vs SL : మూడో టీ20లోనూ భారత్‌దే విజయం, లంకకు వైట్‌వాష్

భారత్ జైత్రయాత్ర కొనసాగుతోంది. టీమిండియా మరో సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసింది. శ్రీలంకతో మూడో టీ20 మ్యాచ్‌లోనూ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది భారత్.

Ind Vs SL : భారత్ జైత్రయాత్ర కొనసాగుతోంది. టీమిండియా మరో టీ20 సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసింది. ఇటీవల వెస్టిండీస్ పై వన్డే, టీ20 సిరీస్ లు నెగ్గి జోరుమీదున్న భారత్… తాజాగా శ్రీలంకపైనా అదే ప్రదర్శన కనబర్చింది. ధర్మశాల వేదికగా శ్రీలంకతో మూడో టీ20 మ్యాచ్‌లోనూ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది భారత్.

శ్రీలంక నిర్దేశించిన 147 పరుగుల టార్గెట్ ను భారత్‌ కేవలం 4 వికెట్లను మాత్రమే కోల్పోయి 16.5 ఓవర్లలో ఛేదించింది. సూపర్ ఫామ్ లో ఉన్న శ్రేయస్ అయ్యర్ మరోసారి హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. 45 బంతుల్లో 73 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అయ్యర్ స్కోరులో 9 ఫోర్లు, 1 సిక్స్ ఉన్నాయి. రవీంద్ర జడేజా 22 నాటైట్, దీపక్‌ హుడా 21, శాంసన్‌ 18 రాణించారు. రోహిత్ 5, వెంకటేశ్‌ 5 పరుగులు చేశారు.

Vinod Kambli: డ్రంక్ అండ్ డ్రైవ్‌లో దొరికిపోయిన సచిన్ చిన్ననాటి ఫ్రెండ్

లంక బౌలర్లలో లహిరు కుమార 2, చమీర, కరుణరత్నే తలో వికెట్ తీశారు. ఈ గెలుపుతో మూడు టీ20ల సిరీస్‌ను భారత్‌ 3-0 తేడాతో క్లీన్‌స్వీప్‌ చేసింది. కాగా, వరుసగా 12వ టీ20 విజయం నమోదు చేసింది భారత్. ఇక ఇరుజట్ల మధ్య రెండు టెస్టుల సిరీస్ మార్చి 4న ప్రారంభం కానుంది.

Ind Vs SL 3rd t20 India won by six wickets on sri lanka

తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక జట్టులో.. కెప్టెన్ దసున్ షనక ధాటిగా ఆడటంతో ఆ జట్టు గౌరవప్రదమైన స్కోరు సాధించింది. శ్రీలంక జట్టు 20 ఓవర్లలో 5 వికెట్లకు 146 పరుగులు చేసింది.

Team India Vs Sri Lanka : వాట్ ఏ క్యాచ్.. శ్రీలంక ఫీల్డర్ అద్భుత ప్రదర్శన

ఓ దశలో శ్రీలంక జట్టు 29 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. అయితే దినేశ్ చాందిమల్ 25 పరుగులు చేయగా, కెప్టెన్ షనక శివాలెత్తిపోయాడు. 38 బంతుల్లోనే 74 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. షనక స్కోరులో 9 ఫోర్లు, 2 సిక్సులున్నాయి. లంక ఇన్నింగ్స్ లో ఓపెనర్లు నిస్సాంక (1), గుణతిలక (0), చరిత్ అసలంక (4,) జనిత్ లియనాగే (9) పరుగులు చేశారు. టీమిండియా బౌలర్లలో ఆవేశ్ ఖాన్ 2 వికెట్లు తీయగా.. సిరాజ్ , హర్షల్ పటేల్ , రవి బిష్ణోయ్ తలో వికెట్ తీశారు.

ట్రెండింగ్ వార్తలు