Team India Vs Sri Lanka : వాట్ ఏ క్యాచ్.. శ్రీలంక ఫీల్డర్ అద్భుత ప్రదర్శన

13 ఓవర్ లాహిరు కుమార వేస్తున్నాడు. అప్పుడు సంజు శాంసన్ బ్యాటింగ్ చేస్తున్నాడు. అతను వేసిన బంతిని భారీ షాట్ కొట్టాలని ప్రయత్నించాడు. బ్యాట్ ఎడ్జ్ కు...

Team India Vs Sri Lanka : వాట్ ఏ క్యాచ్.. శ్రీలంక ఫీల్డర్ అద్భుత ప్రదర్శన

Srilanka

Fernando Stunning Catch : టీమిండియాతో జరిగిన మ్యాచ్ లో శ్రీలంక ఫీల్డర్ పట్టిన క్యాచ్ కు క్రికెట్ అభిమానులు ఫిదా అవుతున్నారు. వాట్ ఏ క్యాచ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అతను చేసిన అద్భుత ప్రదర్శనకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. గాల్లోకి ఎగిరి..సింగిల్ హ్యాండ్ తో క్యాచ్ పట్టుకున్న అతనిపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ధర్మశాల వేదికగా టీమిండియా – శ్రీలంక జట్ల మధ్య టీ20 మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. శ్రీలంకపై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ కు దిగిన లంక జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 183 పరుగులు మాత్రమే చేసింది.

Read More : India vs Sri Lanka, 2nd T20I- చెలరేగిన అయ్యర్.. జడేజా విధ్వంసం.. శ్రీలంకపై భారత్ విజయం!

భారత్ బ్యాటింగ్ చేస్తున్న సందర్భంలో 13 ఓవర్ లాహిరు కుమార వేస్తున్నాడు. అప్పుడు సంజు శాంసన్ బ్యాటింగ్ చేస్తున్నాడు. అతను వేసిన బంతిని భారీ షాట్ కొట్టాలని ప్రయత్నించాడు. బ్యాట్ ఎడ్జ్ కు బంతి తగిలి…షార్ట్ థర్డ్ మెన్ దిశగా బంతి వెళ్లింది. అక్కడ ఫెర్నాండో ఫీల్డింగ్ చేస్తున్నాడు. అమాంతం గాల్లోకి ఎగిరి.. బంతిని సింగిల్ హ్యాండ్ తో వెనక్కి పట్టుకున్నాడు. దీంతో 39 పరుగులు చేసి మంచి ఊపు మీద ఉన్న శాంసన్ పెవిలియన్ కు చేరాడు. ఈ క్యాచ్ కు సంబంధించిన వీడియోను Sandalu Gaganaka ట్విట్టర్ లో పోస్టు చేశారు.