IND vs WI 3rd T20 : మూడో టీ20లో టీమ్ఇండియా విజయం
కీలక పోరుకు టీమ్ఇండియా సిద్దమైంది. 5 మ్యాచుల టీ20 సిరీస్‌లో 0-2తో వెనుకబడిన టీమ్ఇండియా.. సిరీస్‌లో నిలవాలంటే తప్పక గెలవాల్సిన పరిస్థితిలో ఉంది. టాస్ గెలిచిన వెస్టిండీస్ కెప్టెన్ పావెల్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు.

IND vs WI 3rd T20
బోణీ కొట్టిన భారత్
సిరీస్‌లో నిలబడాలి అంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో భారత బ్యాటర్లు అదగొట్టారు. సూర్యకుమార్ యాదవ్ (83; 44 బంతుల్లో 10ఫోర్లు, 4 సిక్సర్లు) విధ్వంసం సృష్టించగా తిలక్ వర్మ(49 నాటౌట్; 37 బంతుల్లో 4 ఫోర్లు, 1సిక్స్ ) సమయోచితంగా రాణించడంతో 160 పరుగుల లక్ష్యాన్ని భారత్ 17.5 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది.
సూర్యకుమార్ యాదవ్ ఔట్..
దూకుడుగా ఆడుతున్న సూర్యకుమార్ యాదవ్(83) ఔట్ అయ్యాడు. అల్జారీ జోసెఫ్ బౌలింగ్(12.4వ ఓవర్)లో భారీ షాట్‌కు యత్నించిన సూర్య బౌండరీ లైన్ వద్ద బ్రాండన్ కింగ్ చేతికి చిక్కాడు. దీంతో భారత్ 121 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది.
సూర్యకుమార్ యాదవ్ అర్ధశతకం
సూర్యకుమార్ యాదవ్ దూకుడుగా ఆడుతున్నాడు. షెపర్డ్ బౌలింగ్‌లో(7.2వ ఓవర్) ఫోర్ కొట్టి 23 బంతుల్లోనే 7 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో అర్థశతకాన్ని పూర్తి చేశాడు. టీ20 కెరీర్‌లో సూర్యకు ఇది 14వ హాఫ్ సెంచరీ
పవర్ ప్లే పూర్తి
సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మలు దూకుడుగా ఆడుతున్నారు. దీంతో పవర్ ప్లే (6 ఓవర్లు) ముగిసే సరికి భారత్ రెండు వికెట్ల నష్టానికి 60 పరుగులు చేసింది. సూర్య 18 బంతుల్లో 36 పరుగులతో, తిలక్ 6 బంతుల్లో 15 పరుగులతో క్రీజులో ఉన్నారు.
శుభ్‌మన్ గిల్ ఔట్
భారత్ మరో వికెట్ కోల్పోయింది. అల్జారీ జోసెఫ్ బౌలింగ్‌లో చార్లెస్ క్యాచ్ అందుకోవడంతో శుభ్‌మన్ గిల్(6) ఔట్ అయ్యాడు. దీంతో భారత్ 34 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది.
యశస్వి జైశ్వాల్ ఔట్
లక్ష్య ఛేదనలో భారత్‌కు ఆరంభంలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అరంగ్రేట టీ20 మ్యాచ్‌లో యశస్వి జైశ్వాల్(1) విఫలం అయ్యాడు. మెకాయ్ బౌలింగ్‌లో(0.4వ ఓవర్) జోసెఫ్ కు క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. దీంతో భారత్ 6 పరుగుల వద్ద మొదటి వికెట్ కోల్పోయింది.
భారత టార్గెట్ 160
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న విండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. విండీస్ బ్యాటర్లలో బ్రాండన్ కింగ్ (42), పావెల్ (40నాటౌట్; 19 బంతుల్లో 1 ఫోరు, 3 సిక్సర్లు) రాణించగా కైల్ మేయర్స్(25), నికోలస్ పూరన్(20)లు ఫర్వాలేదనిపించారు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ మూడు వికెట్లు తీయగా, ముకేశ్ కుమార్, అక్షర్ పటేల్‌లు చెరో వికెట్ పడగొట్టారు.
హెట్మెయర్ ఔట్
ముకేశ్ కుమార్ బౌలింగ్‌లో(17.1వ ఓవర్) షిమ్రాన్ హెట్మెయర్(9) తిలక్ వర్మకు క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. దీంతో విండీస్ 123 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయింది.
బ్రాండన్ కింగ్ ఔట్
కుల్దీప్ యాదవ్ ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు పడగొట్టాడు. 14వ ఓవర్‌లో మొదటి బంతికి పూరన్ ఔట్ కాగా.. ఐదో బంతికి బ్రాండన్ కింగ్(42) కుల్దీప్‌కే క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరుకున్నాడు. దీంతో వెస్టిండీస్ 106 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది.
నికోలస్ పూరన్ స్టంపౌట్
వచ్చి రావడంతో ధాటిగా ఆడుతున్న నికోలస్ పూరన్(20; 12 బంతుల్లో 2ఫోర్లు, 1సిక్స్) ఇన్నింగ్స్ కు తెరపడింది. కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో(14.1వ ఓవర్) స్టంపౌట్ అయ్యాడు. దీంతో వెస్టిండీస్ 105 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది.
చార్లెస్ ఔట్
వెస్టిండీస్ మరో వికెట్‌ను కోల్పోయింది. కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో(10.5వ ఓవర్) చార్లెస్ (12) ఎల్బీగా పెవిలియన్‌కు చేరుకున్నాడు. దీంతో వెస్టిండీస్ 75 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. 11 ఓవర్లకు విండీస్ స్కోరు 76/2.
10 ఓవర్లు పూర్తి
వెస్టిండీస్ బ్యాటర్లు నిలకడగా ఆడుతున్నారు. 10 ఓవర్లు పూర్తి అయ్యే సరికి వెస్టిండీస్ వికెట్ నష్టానికి 73 పరుగులు చేసింది. బ్రాండన్ కింగ్ (32), చార్లెస్(12) పరుగులతో క్రీజులో ఉన్నారు.
మేయర్స్ ఔట్
ఎట్టకేలకు ఏడో ఓవర్‌లో భారత బౌలర్లు వికెట్ పడగొట్టారు. అక్షర్ పటేల్ బౌలింగ్‌లో(7.4వ ఓవర్) అర్ష్‌దీప్ సింగ్ క్యాచ్ అందుకోవడంతో కైల్ మేయర్స్ (25) ఔట్ అయ్యాడు. దీంతో వెస్టిండీస్ 55 పరుగుల వద్ద తొలి వికెట్‌ను కోల్పోయింది.
పవర్ ప్లే పూర్తి
వెస్టిండీస్ ఇన్నింగ్స్‌లో పవర్ ప్లే ముగిసింది. ఓపెనర్లు బ్రాండన్ కింగ్ (21), కైల్ మేయర్స్(16) నిలకడగా ఆడుతున్నారు. ఆరు ఓవర్లు ముగిసే సరికి విండీస్ స్కోరు 38 0
భారత తుది జట్టు : శుభమన్ గిల్, యశస్వి జైస్వాల్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), సంజు శాంసన్(వికెట్ కీపర్), అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్, ముఖేష్ కుమార్
వెస్టిండీస్ తుది జట్టు : బ్రాండన్ కింగ్, కైల్ మేయర్స్, జాన్సన్ చార్లెస్, నికోలస్ పూరన్(వికెట్ కీపర్), రోవ్‌మన్ పావెల్(కెప్టెన్), షిమ్రాన్ హెట్మెయర్, రొమారియో షెపర్డ్, రోస్టన్ చేజ్, అకేల్ హోసేన్, అల్జారీ జోసెఫ్, ఒబెడ్ మెకాయ్
కీలక పోరుకు టీమ్ఇండియా సిద్దమైంది. 5 మ్యాచుల టీ20 సిరీస్‌లో 0-2తో వెనుకబడిన టీమ్ఇండియా.. సిరీస్‌లో నిలవాలంటే తప్పక గెలవాల్సిన పరిస్థితిలో ఉంది. టాస్ గెలిచిన వెస్టిండీస్ కెప్టెన్ పావెల్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఇక భారత జట్టులో రెండు మార్పులు చోటు చేసుకున్నాయి. బిష్ణోయ్ స్థానంలో కుల్దీప్ యాదవ్‌ను తీసుకున్నారు. యువ సంచలనం యశస్వి జైస్వాల్ ఈ మ్యాచ్ ద్వారా టీ20ల్లో అరంగ్రేటం చేయనున్నాను. ఇషాన్ కిషన్‌పై వేటు పడింది.