IND W vs PAK W Harmanpreet Kaur snubs handshake with Fatima Sana
IND W vs PAK W : మహిళల వన్డే ప్రపంచకప్ 2025లో భాగంగా కొలంబో వేదికగా ఆదివారం భారత్, పాక్ జట్ల మధ్య మ్యాచ్ ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో (IND W vs PAK W) టాస్ వేసే సమయంలో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. టీమ్ఇండియా కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ పాకిస్తాన్ కెప్టెన్ ఫాతిమా సనాతో కరచాలనం చేయడానికి నిరాకరించింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
కాగా.. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాకిస్తాన్ ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో భారత్ తొలుత బ్యాటింగ్‌కు దిగింది.
— Drizzyat12Kennyat8 (@45kennyat7PM) October 5, 2025
సూర్య సేన బాటలోనే..
ఇటీవల జరిగిన పురుషల ఆసియాకప్ 2025లో భారత్ విజేతగా నిలిచింది. ఫైనల్ మ్యాచ్‌లో పాక్‌ను చిత్తు చేసి తొమ్మిదోసారి ఆసియాకప్ ట్రోఫీని ముద్దాడింది. కాగా..ఈ టోర్నీలో పాక్‌తో భారత్ మూడు మ్యాచ్‌లు ఆడగా అన్నింటిలోనూ టీమ్ఇండియా గెలుపొందింది.
కాగా.. ఇటీవల ఇరు దేశాల మధ్య చోటు చేసుకున్న ఘటన నేపథ్యంలో ఆసియాకప్ 2025లో పాక్‌తో ఆడిన మ్యాచ్‌ల్లో సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని భారత జట్టు పాక్ ప్లేయర్లతో కరచాలనం చేయని సంగతి తెలిసిందే. దీనిపై పెద్ద ఎత్తున దుమారం రేగిన సంగతి తెలిసిందే.
Ravindra Jadeja : కోహ్లీ, అశ్విన్‌లను అధిగమించిన రవీంద్ర జడేజా.. ఇక మిగిలింది సచిన్ మాత్రమే..
తాజాగా మహిళల జట్టు కూడా పురుషుల జట్టునే ఫాలో అవుతూ పాక్ ప్లేయర్లతో కరచాలనం చేయలేదు.