Ravindra Jadeja : కోహ్లీ, అశ్విన్‌లను అధిగమించిన రవీంద్ర జడేజా.. ఇక మిగిలింది సచిన్ మాత్రమే..
ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా (Ravindra Jadeja ) అరుదైన ఘనత సాధించాడు. టెస్టుల్లో అత్యధిక సార్లు..

Only Sachin Tendulkar has more Player of the match award than Ravindra Jadeja in Indian Test Cricket
Ravindra Jadeja : టీమ్ఇండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా అరుదైన ఘనత సాధించాడు. టెస్టుల్లో అత్యధిక సార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు అందుకున్న భారత ఆటగాళ్లలో రెండో స్థానానికి చేరుకున్నాడు. వెస్టిండీస్‌తో అహ్మదాబాద్ వేదికగా జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచిన తరువాత జడ్డూ (Ravindra Jadeja ) ఈ ఘనత సాధించాడు. ఈ క్రమంలో అతడు దిగ్గజ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రవించంద్రన్ అశ్విన్‌లను అధిగమించాడు.
టీమ్ఇండియా తరుపున టెస్టు క్రికెట్‌లో అత్యధిక సార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు అందుకున్న ఘనత సచిన్ టెండూల్కర్ పేరిట ఉంది. సచిన్ తన కెరీర్‌లో 14 సార్లు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు అందుకున్నాడు. ఆ తరువాత రాహుల్ ద్రవిడ్, జడేజాలు చెరో 11 సార్లు ఈ ఘనత సాధించి రెండో స్థానంలో నిలిచారు.
టెస్టుల్లో అత్యధిక సార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు అందుకున్న భారత ఆటగాళ్లు వీరే..
* సచిన్ టెండూల్కర్ – 14 సార్లు
* రవీంద్ర జడేజా – 11 సార్లు
* రాహుల్ ద్రవిడ్ – 11 సార్లు
* రవిచంద్రన్ అశ్విన్ – 10 సార్లు
* విరాట్ కోహ్లీ – 10 సార్లు
* అనిల్ కుంబ్లే – 10 సార్లు
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 162 పరుగులకే ఆలౌటైంది. అనంతరం కేఎల్ రాహుల్ (100), ధ్రువ్ జురెల్ (125), రవీంద్ర జడేజా (104 నాటౌట్) శతకాలతో చెలరేగగా.. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (50) హాఫ్ సెంచరీతో రాణించడంతో తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 448/5 స్కోరు వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది.
Only Sachin Tendulkar has more Player of the match award than Ravindra Jadeja in Indian Test Cricket 🤯
– Jaddu needs to be praised more & more, truly Once in a Generation Cricketer. pic.twitter.com/LGwou3w1uN
— Johns. (@CricCrazyJohns) October 4, 2025
286 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన వెస్టిండీస్ 45.1 ఓవర్లలో 146 పరుగులకే కుప్పకూలింది. దీంతో భారత్ ఇన్నింగ్స్ 140 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపుతో భారత్ రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి దూసుకువెళ్లింది.