Harjas Singh : వీడెవండీ బాబు.. 50 ఓవ‌ర్ల క్రికెట్‌లో సెంచ‌రీనే క‌ష్ట‌మంటే ఏకంగా ట్రిపుల్ సెంచ‌రీ బాదేశాడు

వెస్ట్రర్న్‌ సబర్బ్స్ జ‌ట్టుకు ప్రాతినిధ్యం వ‌హించిన‌ హర్జాస్ సింగ్ (Harjas Singh) ఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగాడు.

Harjas Singh : వీడెవండీ బాబు.. 50 ఓవ‌ర్ల క్రికెట్‌లో సెంచ‌రీనే క‌ష్ట‌మంటే ఏకంగా ట్రిపుల్ సెంచ‌రీ బాదేశాడు

Harjas Singh Australian Batter Smashes 314 Runs Off 141 Balls Scripts History

Updated On : October 5, 2025 / 10:40 AM IST

Harjas Singh : సాధార‌ణంగా వ‌న్డేల్లో సెంచ‌రీ చేస్తేనే గొప్ప‌గా భావిస్తుంటారు. ఇక ద్విశ‌త‌కం అంటే అత‌డొక గొప్ప ప్లేయ‌ర్ అనాల్సిందే. మ‌రి ఏకంగా ట్రిపుల్ సెంచ‌రీ బాదితే. అవును.. భార‌త సంత‌తికి చెందిన ఓ ఆస్ట్రేలియా ఆట‌గాడు వ‌న్డేల్లో ఏకంగా ట్రిపుల్ సెంచ‌రీ చేశాడు. అయితే.. ఈ రికార్డు అంత‌ర్జాతీయ క్రికెట్‌లో న‌మోదు కాలేదండోయ్‌.. డొమెస్టిక్ స్టాయిలో చోటు చేసుకుంది.

శ‌నివారం ప్యాటర్న్ పార్క్‌లో సిడ్నీ క్రికెట్ క్లబ్‌, వెస్ట్రన్ సబర్బ్స్ జ‌ట్ల మ‌ధ్య మ్యాచ్ జ‌రిగింది. ఈ మ్యాచ్‌లో వెస్ట్రర్న్‌ సబర్బ్స్ జ‌ట్టుకు ప్రాతినిధ్యం వ‌హించిన‌ హర్జాస్ సింగ్ (Harjas Singh) ఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగాడు. ప్ర‌త్య‌ర్థి బౌల‌ర్ల‌ను ఊచ‌కోత కోశాడు. 74 బంతుల్లో శ‌త‌కాన్ని అందుకున్న హ‌ర్జాస్ ఆ త‌రువాత తుఫాన్ ఇన్నింగ్స్ ఆడాడు. మ‌రో 67 బంతుల్లో ఇంకో 214 ప‌రుగులు సాధించాడు.

IND vs PAK : నేడు భార‌త్‌, పాక్ మ‌ధ్య మ్యాచ్‌.. ఫ్రీగా ఎలా చూడొచ్చొ తెలుసా?

మొత్తంగా 141 బంతుల్లోనే 314 ప‌రుగులు చేశాడు. ఇందులో 35 సిక్స‌ర్లు 14 ఫోర్లు ఉన్నాయి. ఈ క్ర‌మంలో గ్రేడ్ లెవ‌ల్ క్రికెట్‌లో ప‌రిమిత ఓవ‌ర్ల మ్యాచ్‌ల్లో ట్రిపుల్ సెంచ‌రీ చేసిన తొలి ఆట‌గాడిగా రికార్డుకు ఎక్కాడు.

హర్జాస్ త‌ల్లిదండ్రులు భార‌త్‌లోని పంజాబ్‌కు చెందిన వారు. 2000లో వారు చండీగ‌డ్ నుంచి సిడ్నీకి వ‌ల‌స వెళ్లారు. హర్జాస్ ఆస్ట్రేలియాలోని సిడ్నీలో జ‌న్మించాడు. ద‌క్షిణాఫ్రికా వేదిక‌గా జ‌రిగిన అండ‌ర్‌-19 ప్ర‌పంచ‌క‌ప్ 2024 ద్వారా హర్జాస్ తొలిసారి వెలుగులోకి వ‌చ్చాడు. భార‌త్‌, ఆసీస్ జట్ల మ‌ధ్య జ‌రిగిన ఫైన‌ల్ మ్యాచ్‌లో 64 బంతుల్లో 55 ప‌రుగులు చేసి ఆసీస్ టైటిల్ గెల‌వ‌డంతో త‌న వంతు పాత్ర పోషించాడు.

ఇక ట్రిపుల్ సెంచ‌రీ సాధించ‌డం పై హర్జాస్ ఆనందాన్ని వ్య‌క్తం చేశాడు. హిట్టింగ్ ఆడ‌డం అంటే త‌న‌కు ఎంతో ఇష్టం అన్నాడు. ఈ రోజు మాత్రం త‌న కెరీర్‌లో ఎంతో ప్ర‌త్యేకంగా నిలిచిపోతుంద‌న్నాడు.

Shubman Gill : వ‌న్డే కెప్టెన్ అయిన త‌రువాత తొలిసారి స్పందించిన శుభ్‌మ‌న్ గిల్‌.. ‘నా ల‌క్ష్యం అదే.. ఇక చూడండి..’

మూడో బ్యాట‌ర్‌..
న్యూ సౌత్ వేల్స్ ప్రీమియర్ ఫస్ట్-గ్రేడ్ క్రికెట్‌లో ట్రిపుల్ సెంచరీలు నమోదు చేసిన ముగ్గురు ఆటగాళ్లలో ఫిల్ జాక్వెస్ (321), విక్టర్ ట్రంపర్ (335) లతో పాటు ఇప్పుడు హర్జాస్ నిలిచాడు.

హర్జాస్ విధ్వంసంతో తొలుత బ్యాటింగ్ చేసిన వెస్ట్రన్ సబర్బ్స్ జ‌ట్టు నిర్ణీత 50 ఓవ‌ర్ల‌లో 5 వికెట్ల న‌ష్టానికి 483 ప‌రుగులు చేసింది. ల‌క్ష్య ఛేద‌న‌లో సిడ్నీ క్రికెట్ క్లబ్ నిర్ణీత 50 ఓవ‌ర్ల‌లో 8 వికెట్ల న‌ష్టానికి 287 ప‌రుగుల‌కే ప‌రిమితమైంది. దీంతో వెస్ట్రన్ సబర్బ్స్ జ‌ట్టు 287 ప‌రుగులు సాధించింది.