Shubman Gill : వన్డే కెప్టెన్ అయిన తరువాత తొలిసారి స్పందించిన శుభ్‌మన్ గిల్.. ‘నా లక్ష్యం అదే.. ఇక చూడండి..’
టీమ్ఇండియా వన్డే కెప్టెన్‌గా నియమితులైన తరువాత శుభ్‌మన్ గిల్ (Shubman Gill ) తొలిసారి స్పందించాడు.

Shubman Gill First Reaction After Becoming India New ODI Captain
Shubman Gill : అక్టోబర్19న నుంచి ఆస్ట్రేలియాతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌లో పాల్గొనే భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. సీనియర్ ఆటగాడు రోహిత్ శర్మను వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించారు. అతడి స్థానంలో టెస్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌ను నాయకుడిగా నియమించారు. వన్డే ప్రపంచకప్ 2027 దృష్టిలో పెట్టుకునే కెప్టెన్సీ మార్పు పై నిర్ణయం తీసుకున్నట్లు చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ స్పష్టం చేశాడు.
కాగా.. వన్డే కెప్టెన్‌గా నియమితుడైన తరువాత తొలిసారి శుభ్‌మన్ గిల్ (Shubman Gill )స్పందించాడు. వన్డేల్లో జట్టును నడిపించడం గొప్ప గౌరవంగా భావిస్తున్నానని అన్నాడు. వన్డే ప్రపంచకప్ 2027ను గెలవడమే తన లక్ష్యం అని చెప్పుకొచ్చాడు.
Ajit Agarkar : అందుకే రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తప్పించాం.. అజిత్ అగార్కర్ కామెంట్స్..
‘దేశం తరుపున ఏ ఫార్మాట్‌లోనైనా జట్టుకు నాయకత్వం వహించడం ఎల్లప్పుడూ గొప్ప గౌరవమే. ఇక వన్డే సారథ్యం కూడా గౌరవంగానే భావిస్తున్నాను. వన్డే ప్రపంచకప్ 2027లోపు టీమ్ఇండియా కనీసం 20 మ్యాచ్‌లు ఆడే అవకాశం ఉంది. మా లక్ష్యం కూడా వన్డే ప్రపంచకప్ గెలవడమే.’ అని గిల్ అన్నాడు.
First Test at Home as Captain ✅
Clinical Performance ✅
India’s new ODI captain ✅After leading #TeamIndia in his maiden Test as captain at home, Shubman Gill reacts to being crowned new ODI captain 👌 – By @Moulinparikh #INDvWI | #AUSvIND | @idfcfirstbank | @ShubmanGill
— BCCI (@BCCI) October 4, 2025
తన అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేందుకు కృషి చేస్తానన్నాడు. దక్షిణాఫ్రికా వేదికగా జరగనున్న వన్డే ప్రపంచకప్ ను గెలుచుకునేందుకు ఓ జట్టుగా సిద్ధం అవుతామని చెప్పుకొచ్చాడు.
జట్టు కెప్టెన్సీ నుంచి తప్పించినప్పటికి రోహిత్ శర్మకు జట్టులో స్థానం కల్పించారు. సీనియర్ ఆటగాడు విరాట్ కోహ్లీకి చోటు ఇచ్చారు. వైస్ కెప్టెన్సీ బాధ్యతలను శ్రేయస్ అయ్యర్‌కు అప్పగించారు.
ఆస్ట్రేలియా పర్యటనకు భారత వన్డే జట్టు ఇదే..
శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, మహ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), యశస్వి జైస్వాల్.