Kris Srikkanth : గంభీర్ ఉన్నంత కాలం అతడు జట్టులో శాశ్వత ప్లేయర్.. ఆసీస్ పర్యటనకు జట్టు ఎంపిక పై శ్రీకాంత్ కామెంట్స్..
టీమ్ఇండియా మాజీ ఆటగాడు క్రిష్ణమాచారి శ్రీకాంత్ (Kris Srikkanth) ఓ అడుగు ముందుకు వేసి అతడు గంభీర్ తాలూకా ప్లేయర్ అంటూ విమర్శలు గుప్పించాడు.

Harshit Rana Be A Constant Yes Man To Gambhir Kris Srikkanth
Kris Srikkanth : ఈ నెలలో భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది. ఈ పర్యటనలో ఆతిథ్య ఆస్ట్రేలియాతో భారత్ మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లు ఆడనుంది. ఈ సిరీస్‌ల్లో పాల్గొనే భారత జట్లను బీసీసీఐ ప్రకటించింది. రోహిత్ శర్మను వన్డే సారథ్య బాధ్యతల నుంచి తప్పించింది. అతడి స్థానంలో టెస్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ కు సారథ్య బాధ్యతలను అప్పగించింది.
ఆస్ట్రేలియాతో ఆడే వన్డే, టీ20సిరీస్‌లకు ఎంపిక చేసిన రెండు జట్లలో ఓ యువ ఆటగాడు చోటు దక్కించుకున్నాడు. అతడు మరెవరో కాదు యువ పేసర్ హర్షిత్ రాణా. టీమ్ఇండియా ప్రధాన కోచ్‌గా గౌతమ్ గంభీర్ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి దాదాపు ప్రతి సిరీస్‌లోనూ అతడు చోటు దక్కించుకుంటూ వస్తున్నాడు. అయితే.. తనకు లభించిన అవకాశాలను అతడు సద్వినియోగం చేసుకోవడం లేదు.
Ravindra Jadeja : కోహ్లీ, అశ్విన్‌లను అధిగమించిన రవీంద్ర జడేజా.. ఇక మిగిలింది సచిన్ మాత్రమే..
ఈ క్రమంలో ఆసీస్ పర్యటనకు రెండు జట్లలోనూ హర్షిత్ రాణాకు చోటు ఇవ్వడం పై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. టీమ్ఇండియా మాజీ ఆటగాడు క్రిష్ణమాచారి శ్రీకాంత్ (Kris Srikkanth)ఓ అడుగు ముందుకు వేసి అతడు గంభీర్ తాలూకా ప్లేయర్ అంటూ విమర్శలు గుప్పించాడు.
హర్షిత్ రాణా అంటే గంభీర్‌కు చాలా ఇష్టమని, అందుకనే అతడు జట్టులో శాశ్వత ప్లేయర్ అంటూ మండిపడ్డాడు. అందుకనే జాబితాలో గిల్ తరువాత హర్షిత్ పేరే ఉంటుందని ఆగ్రహం వ్యక్తం చేశాడు. గాయపడిన హార్దిక్ పాండ్యా స్థానంలో నితీశ్ కుమార్ రెడ్డిని ఎంచుకోవడాన్ని శ్రీకాంత్ తప్పుబట్టాడు. అతడి కంటే రవీంద్ర జడేజాను తీసుకుంటే బాగుండేదన్నాడు. ఒకవేళ నితీశ్‌ను తీసుకోవాలని సెలక్టర్లు అనుకుంటే అతడిని బ్యాటర్‌గానే ఎంపిక చేయాలన్నాడు. ఎందుకంటే అతడు తక్కువగా బౌలింగ్ చేస్తాడన్నారు.