అతి అనేదానికి పరాకాష్ట బంగ్లాదేశ్ క్రికెట్ ఆటగాళ్లు.. ఈ విషయంలో ఎటువంటి సందేహం అక్కర్లేదు. వాళ్లు వేసే పులి వేషాలు మాములుగా ఉండవు.. ఒక్క మ్యాచ్ గెలిస్తేనే మాములుగా ఉండదు. అటువంటిది ప్రపంచకప్ గెలిస్తే వాళ్ల హడావుడి మాములుగా ఉంటుందా?
అందులోనూ భారత్ వంటి టీమ్ మీద గెలిస్తే వాళ్లను ఆపడం కష్టమే.. నాగిని డ్యాన్స్‌లు.. ప్రత్యర్ధులను ఉడికించే చేస్టలు మాములే. జెంటిల్ మెన్ గేమ్ అయినా క్రికెట్‌లో ఇటువంటివి చెయ్యకూడదు.. అదే ఐసీసీ రూల్.. అయినా కూడా వాళ్లు ఆగరు.. ఇంటర్నేషనల్ గేమ్‌లలోనే అలా ఉంటే ఇక యంగ్ ఆటగాళ్లు ఎలా ఉంటారు. వాళ్లను ఆపడం సాధ్యం కాదు కదా అదే జరిగింది. అండర్ 19 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో.
తొలిసారి ప్రపంచ కప్ గెలిచిన బంగ్లాదేశ్ అండర్ 19 జట్టు హుందాతనం మరిచిపోయి.. క్రీడా స్ఫూర్తిని పక్కనబెట్టేసి మైదానంలో తుంటరి చేష్టలకు దిగింది. దక్షిణాఫ్రికా గడ్డపై జరుగుతున్న అండర్ 19 ప్రపంచకప్ టోర్నీలో ఫైనల్ మ్యాచ్‌లో గెలిచి చాంపియన్‌గా నిలిచిన బంగ్లాదేశ్ యువ ఆటగాళ్లు కాస్త అతిగా ప్రవర్తించారు. మ్యాచ్ గెలిచిన అనంతరం ఆటగాళ్లు ఉద్వేగంగా మైదానంలోకి పరిగెత్తుకొచ్చారు.
ఆనందంలో అలా చెయ్యడంలో తప్పు లేదు. అయితే ప్రత్యర్ధి ఆటగాళ్లైన భారత యువ ఆటగాళ్లను గేలి చేస్తూ.. అసభ్యకరంగా మాట్లాడుతూ రెచ్చిపోయారు బంగ్లా యువ ఆటగాళ్లు. ముఖ్యంగా పేసర్ షోరిఫుల్ ఇస్లాం టీమిండియా ఆటగాళ్లపై అనవసర వ్యాఖ్యలు చేశాడు. ఓ ఆటగాడు అయితే ఏకంగా టీమిండియా ఆటగాళ్లను కొట్టేందుకు దూకాడు.
అయితే భారత క్రికెటర్ అతడిని నెట్టివేశాడు. అంపైర్‌లు నిర్వాహకులు జోక్యం చేసుకొని ఇరు జట్ల మధ్య గొడవను సద్దు మణిగేలా చేశారు అనుకోండి అయితే ఏళ్లకు ఏళ్లుగా ఎటువంటి విజయాలు లేని బంగ్లాదేశ్‌కి విజయం వచ్చినందుకు కంగ్రాచ్యులేషన్స్ అని మన ఆటగాళ్లు చెబుతుంటే వాళ్లు ఇలా చెయ్యడంపై విమర్శలు వస్తున్నాయి.
Shameful end to a wonderful game of cricket. #U19CWCFinal pic.twitter.com/b9fQcmpqbJ
— Sameer Allana (@HitmanCricket) February 9, 2020