India Vs Pak Match: మరోసారి దాయాది జట్ల మధ్య పోరు.. సూపర్-4లో తలపడనున్న భారత్ – పాక్ జట్లు.. ఎప్పుడంటే?

ఆసియా కప్‌లో చిరకాల ప్రత్యర్థులు భారత్ - పాకిస్థాన్ జట్ల మధ్య మరోసారి సమరం జరగనుంది. గ్రూప్ -ఏ నుంచి రెండు జట్లు సూపర్ -4 దశకు చేరుకున్నాయి. దీంతో ఆదివారం (సెప్టెంబర్ 4న) మరోసారి భారత్ - పాకిస్థాన్ జట్లు మధ్య మ్యాచ్ జరగనుంది.

India Vs Pak Match: ఆసియా కప్‌లో చిరకాల ప్రత్యర్థులు భారత్ – పాకిస్థాన్ జట్ల మధ్య మరోసారి సమరం జరగనుంది. గత ఆదివారం గ్రూప్-ఏలో ఇరు జట్లు తలపడ్డాయి. ఉత్కంఠభరితంగా సాగిన ఈ పోరులో పాకిస్థాన్ జట్టుపై భారత్ విజయం సాధించింది. తాజాగా మరోసారి భారత్ – పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. సెప్టెంబర్ 4న ఇరు జట్లు తలపడనున్నాయి. గ్రూప్ – ఏలో భారత్, పాకిస్థాన్, హాంకాంగ్ జట్లు ఆడాయి. భారత్ రెండు జట్లపై విజయం సాధించి సూపర్-4కు చేరగా, పాకిస్థాన్ హాంకాంగ్ జట్టుపై భారీ విజయం సాధించింది సూపర్ -4లోకి అడుగుపెట్టింది. శుక్రవారం హాంకాంగ్ తో జరిగిన మ్యాచ్ లో పాకిస్థాన్ జూలు విదిల్చింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాక్.. 193 పరుగుల భారీ స్కోరును సాధించింది. అనంతరం ప్రత్యర్థి హాంకాంగ్ జట్టును కేవలం 38 పరుగులకే కుప్పకూల్చింది.

India vs pakistan match in asia cup-2022: ఇండియా – పాకిస్థాన్ జట్ల మధ్య ఆదివారం రాత్రి జరిగిన మ్యాచ్‌కు సంబంధించిన ఫొటో గ్యాలరీ

ఆసియా కప్‌లో గ్రూప్-ఏ నుంచి భారత్, పాక్.. గ్రూప్ – బి నుంచి ఆప్గానిస్థాన్, శ్రీలంక జట్లు సూపర్ -4 దశకు అర్హత సాధించాయి. ఈ దశలో ప్రతి జట్టూ మిగతా మూడు జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది. టాప్-2 జట్లు ఫైనల్లో తలపడతాయి. నేడు శ్రీలంక – ఆప్గానిస్థాన్ మధ్య మ్యాచ్ జరగనుండగా, ఆదివారం (సెప్టెంబర్ 4) భారత్ – పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. సెప్టెంబర్ 6న భారత్ – శ్రీలంక మధ్య, 7న పాకిస్థాన్ – ఆప్గానిస్థాన్ మధ్య, 8న భారత్ – ఆప్గానిస్థాన్ జట్ల మధ్య, 9న పాకిస్థాన్ – శ్రీలంక జట్ల మధ్య మ్యాచ్ లు జరగనున్నాయి. ఫైనల్ మ్యాచ్ ఈ నెల 11న జరుగుతుంది.

Asia Cup 2022 Ind Vs Pak : వాటే మ్యాచ్.. పాకిస్తాన్‌పై భారత్ థ్రిల్లింగ్ విక్టరీ.. ప్రతీకారం తీర్చుకుంది

ఆసియాకప్‌లో రేపు జరిగే భారత్ – పాకిస్థాన్ మ్యాచ్ కోసం ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. గత ఆదివారం జరిగిన మ్యాచ్ లో భారత్ విజయం సాధించగా, ఈసారి పాకిస్థాన్ విజయం సాధించి ప్రతీకారం తీర్చుకొనేందుకు సిద్ధమవుతుంది. మరోవైపు భారత్ జట్టు బలంగా ఉంది. వరుసగా రెండు మ్యాచ్‌లలో విజయం సాధించిన టీమిండియా  పాకిస్థాన్ జట్టును మరోసారి ఓడించేందుకు సిద్ధమవుతోంది. అయితే టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా గాయం కారణంగా ఆసియా కప్ నుంచి వైదొలిగాడు. అతని స్థానంలో అక్షర్ పటేల్ జట్టులోకి రానున్నాడు. జడేజా మోకాలి గాయంతో బాధపడుతున్నాడు.

ట్రెండింగ్ వార్తలు