భారత్ – సౌతాఫ్రికా టెస్టు మ్యాచ్..మళ్లీ బ్యాటింగేనా

  • Publish Date - October 13, 2019 / 02:23 AM IST

భారత్-సౌతాఫ్రికా మధ్య పూణేలో జరుగుతున్న రెండో టెస్టు ఆసక్తికరంగా మారింది. సఫారీలు 275 పరుగులకు ఆలౌట్ అవడంతో..ఇప్పుడు టీమిండియా దక్షిణాఫ్రికాని ఫాలో ఆన్ ఆడిస్తుందా లేక  సెకండ్ ఇన్నింగ్స్‌ బ్యాటింగ్‌కి దిగుతుందా అనే అంశం ఫ్యాన్స్‌లో టెన్షన్ కలగజేస్తోంది. మూడోరోజు ఆటలో సఫారీ బ్యాట్స్‌మెన్ లంచ్ బ్రేక్ వరకూ వరకూ విసిగించినా..ఆ తర్వాత మాత్రం త్వరత్వరగా వికెట్లు సమర్పించుకున్నారు.

దీంతో సౌతాఫ్రికా ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 275 పరుగులు మాత్రమే చేయగలిగింది. లాస్ట్ వికెట్ పడగానే అంపైర్లు ఆటని నిలిపివేయడంతో..టీమిండియా సఫారీలను ఫాలో ఆన్ ఆడిస్తుందో..లేదంటే  రెండో ఇన్నింగ్స్ ఆడుతుందో అనే డౌట్ మొదలైంది. రెండు రోజుల ఆట మిగిలి ఉండటంతో కోహ్లీ సౌతాఫ్రికాకి ఏ ఛాన్స్ ఇవ్వకుండా..బ్యాటింగ్‌కి దిగవచ్చనే ఎక్కువమంది అంచనా వేస్తున్నారు.

ఓవర్‌నైట్‌ స్కోర్‌ 36 పరుగులతో క్రీజులోకి వచ్చిన సఫారీలలో కెప్టెన్ డుప్లెసిస్.. కేశవ్ మహారాజ్, ఫిలాండర్  తప్ప ఎవరూ ఎక్కువ పరుగులు చేయలేదు..అయితే ఔటవడానికి మాత్రం భారత బౌలర్లు శ్రమించాల్సి వచ్చింది. 64 పరుగులు చేసిన డుప్లెసిస్‌ పెవిలియన్ దారి పట్టిన తర్వాత ఫిలాండర్ , కేశవ్ మహారాజ్ సౌతఫ్రికా ఇన్నింగ్స్‌ని కాస్త చక్కదిద్దారు. గేమ్ చివరి ఓవర్లలో రవిచంద్రన్ అశ్విన్ రెచ్చిపోవడంతో.. కేశవ్‌ మహరాజ్‌ వికెట్ పడింది. ఆ తర్వాత కాసేపటికే సౌతాఫ్రికా ఆలౌటైంది..టీమిండియా బౌలర్లలో ఉమేష్ యాదవ్‌కి మూడు..అశ్విన్‌కి నాలుగు వికెట్లు దక్కాయి. 
Read More : అభిమానం ఎక్కువైంది: రోహిత్ శర్మ.. కాళ్లు పట్టుకుంటే కింద పడిపోయాడు