Under-19 World Cup : టీమిండియా వైస్ కెప్టెన్‌గా గుంటూరు కుర్రాడు

టీమిండియా అండర్-19 జట్టులో ఆంధ్రా (గుంటూరు) ఆటగాడు షేక్ రషీద్ కు చోటు దక్కింది. రషీద్ ను వైస్ కెప్టెన్ గా నియమించారు.

Under-19 World Cup : వెస్టిండీస్ వేదికగా అండర్-19 వరల్డ్ కప్ 2022 జరగనుంది. ఈ మెగా టోర్నీలో పాల్గొనే భారత జట్టును బీసీసీఐ ఆదివారం ప్రకటించింది. టీమిండియా అండర్-19 జట్టులో గుంటూరు ఆటగాడు షేక్ రషీద్ కు చోటు దక్కింది. విశేషం ఏంటంటే… రషీద్ ను వైస్ కెప్టెన్ గా నియమించారు. ఈ జట్టుకు కెప్టెన్ గా యశ్ ధుల్ వ్యవహరిస్తాడు. ఈ టోర్నీ 2022 జనవరి 14న ప్రారంభం కానుంది. 17 మందితో కూడిన జట్టును బీసీసీఐ జూనియర్ సెలెక్షన్ కమిటీ ఎంపిక చేసింది.

టీమిండియా అండర్-19 జట్టు..
యశ్ ధుల్ (కెప్టెన్), షేక్ రషీద్ (వైస్ కెప్టెన్), రవికుమార్, రాజ్ అంగద్ బవా, అనీశ్వర్ గౌతమ్, హర్నూర్ సింగ్, గర్వ్ సంగ్వాన్, వసు వాత్స్, మానవ్ పరాక్, ఆరాధ్య యాదవ్ (వికెట్ కీపర్), దినేశ్ బనా (వికెట్ కీపర్), సిద్ధార్థ్ యాదవ్, కుశాల్ తంబే, విక్కీ ఉత్సవల్, అంగ్ క్రిష్ రఘువంశీ, ఆర్ఎస్ హంగర్కేర్, నిశాంత్ సింధు.

Drinks To Burn Fat : పొట్ట చుట్టూ కొవ్వు కరగాలంటే ఈ పానీయాలు ట్రై చేసి చూడండి

ఇక స్టాండ్ బై ఆటగాళ్లుగా అమిత్ రాజ్ ఉపాధ్యాయ్, రిషిత్ రెడ్డి, పీఎం సింగ్ రాథోడ్, ఉదయ్ శరవణ్, అన్ష్ ఘోసాయ్ లను ఎంపిక చేశారు.

పద్నాలుగో ఎడిషన్‌ ప్రపంచకప్‌ టోర్నమెంట్‌లో మొత్తం 48 మ్యాచ్‌లను ఐసీసీ నిర్వహిస్తోంది. వరల్డ్‌ కప్‌ కోసం 16 జట్లు పోటీ పడనున్నాయి. నాలుగు గ్రూప్‌లుగా విడిపోయి తలపడతాయి.

Chicken : చికెన్ అతిగా తింటున్నారా…అయితే జాగ్రత్త?

అండర్‌ -19 గత ఎడిషన్‌ (2020)లో రన్నరప్‌ నిలిచిన టీమిండియా ఇప్పటివరకు నాలుగు సార్లు కప్‌ను గెలుచుకుంది. 2000, 2008, 2012, 2018లో టైటిల్స్‌ను సాధించింది. ఇక 2016, 2020ల్లో రన్నరప్‌గా నిలిచింది. ఈసారి కూడా టైటిల్‌ను సొంతం చేసుకోవాలని భారత్‌ యువ జట్టు ఉవ్విళ్లూరుతోంది. జనవరి 15న దక్షిణాఫ్రికాతో, జనవరి 19న ఐర్లాండ్, జనవరి 22న ఉగాండాతో భారత్ తలపడనుంది.

ట్రెండింగ్ వార్తలు