Asian Champions Trophy : ఐదోసారి ఆసియా ఛాంపియన్స్‌ ట్రోఫీ విజేతగా భారత్‌

ఆసియా ఛాంపియ‌న్స్ ట్రోఫీ విజేత‌గా భార‌త్ నిలిచింది.

India clinch fifth Asian Champions Trophy title

Asian Champions Trophy 2024 : ఆసియా ఛాంపియ‌న్స్ ట్రోఫీ విజేత‌గా భార‌త్ నిలిచింది. ఆతిథ్య చైనాతో జ‌రిగిన మ్యాచ్‌లో భార‌త్ 1-0 తేడాతో విజ‌యాన్ని అందుకుంది. త‌ద్వారా ఐదోసారి స‌గ‌ర్వంగా ట్రోఫీని ఎత్తుకుంది. 13 ఏళ్ల ఛాంపియ‌న్స్ ట్రోఫీ చ‌రిత్ర‌లో భార‌త్‌కు ఇది ఐదో టైటిల్ కావ‌డం గ‌మ‌నార్హం. టీమ్ఇండియా త‌రుపున న‌మోదైన ఏకైక గోల్‌ను జుగ్రాజ్ సింగ్ 50వ నిమిషంలో న‌మోదు చేశాడు.

డిఫెండింగ్ ఛాంపియ‌న్‌గా బ‌రిలోకి దిగిన భార‌త్ ఓట‌మే ఎర‌గ‌కుండా టైటిల్‌ను అందుకుంది. హ‌ర్మ‌న్‌ప్రీత్ సింగ్ నాయ‌క‌త్వంలో భార‌త హాకీ జ‌ట్టు ఫైన‌ల్ స‌హా వ‌రుస‌గా ఏడు మ్యాచుల్లో గెలిచింది. గ్రూప్‌ దశలో జపాన్‌ను 5-1 తేడాతో, చైనాను 3-0, మలేషియాపై 8-1, దక్షిణ కొరియాను 3-1, చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై 2-1 తేడాతో విజయం సాధించింది. ఇక సెమీ ఫైనల్స్‌లో దక్షిణ కొరియాపై 4-1 తేడాతో గెలిచింది.

Neeraj Chopra : నీర‌జ్ చోప్రాను ఫోన్ నంబ‌ర్ అడిగిన లేడీ ఫ్యాన్.. మ‌నుభాకర్‌కు తెలిస్తే?

లీగ్ ద‌శ‌లో ఏ మాత్రం పోటీ ఇవ్వ‌ని చైనా జ‌ట్టు ఫైన‌ల్‌లో మాత్రం గ‌ట్టి పోటీ ఇచ్చింది. ఇరు జ‌ట్లు గోల్స్ కోసం తీవ్రంగా క‌ష్ట‌ప‌డ్డాయి. మూడు క్వార్ట‌ర్స్‌లో భార‌త అవ‌కాశాల‌ను చైనా అడ్డుకుంది. అయితే.. నాలుగో క్వార్ట‌ర్స్‌లో జుగ్రాజ్ సింగ్ గోల్ చేయ‌డంతో భార‌త్ ఆధిక్యంలోకి దూసుకువెళ్లింది. మిగిలిన స‌మ‌యం మొత్తం ఆధిక్యాన్ని కాపాడుకుంటూ వ‌చ్చిన భార‌త్ మ్యాచ్‌తో పాటు టైటిల్ విజేత‌గా నిలిచింది.

గతంలో భారత్ 2011, 2016, 2018, 2021లో ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ టైటిళ్లను గెలుచుకుంది. ఇప్పుడు 2024లో విజేత‌గా నిలిచింది.

Womens T20 World Cup prize money : ఐసీసీ కీల‌క నిర్ణ‌యం.. 225 శాతం పెరిగిన మ‌హిళ‌ల టీ20 ప్ర‌పంచ‌క‌ప్ ప్రైజ్‌మ‌నీ