Asian Para Games : ఆసియా పారా గేమ్స్‌లో భారత్‌కు 111 పతకాలు

ఆసియా పారా గేమ్స్ లో భారత క్రీడాకారులు చరిత్ర సృష్టించారు. భారతదేశానికి పారా క్రీడల్లో 111 పతకాలు లభించాయి. భారతదేశ క్రీడాకారులకు ఇప్పటివరకు 29 స్వర్ణ పతకాలు, 31 రజతపతకాలు దక్కాయి....

Asian Para Games : ఆసియా పారా గేమ్స్‌లో భారత్‌కు 111 పతకాలు

Asian Para Games

Updated On : October 28, 2023 / 1:48 PM IST

Asian Para Games : ఆసియా పారా గేమ్స్ లో భారత క్రీడాకారులు చరిత్ర సృష్టించారు. భారతదేశానికి పారా క్రీడల్లో 111 పతకాలు లభించాయి. భారతదేశ క్రీడాకారులకు ఇప్పటివరకు 29 స్వర్ణ పతకాలు, 31 రజతపతకాలు దక్కాయి. పారా ఆసియా క్రీడల్లో భారత క్రీడాకారిణి శీతల్ చరిత్ర సృష్టించింది.హాంగ్‌జౌలో జరుగుతున్న ఆసియా పారా గేమ్స్‌లో దిలీప్ మహదు గవిత్ స్వర్ణ పతకాన్ని సాధించి భారత్ పతకాల సంఖ్యను 100కు చేర్చాడు.

Also Read :  Israel’s New Secret Weapon : ఇజ్రాయెల్ కొత్త రహస్య ఆయుధాలు…స్పాంజ్ రసాయన గ్రెనెడ్ బాంబులు

హాంగ్‌జౌలో జరిగిన ఆసియా పారా గేమ్స్‌లో భారత క్రీడాకారులు 111 పతకాలు సాధించి చరిత్ర సృష్టించారు. పురుషుల 400 మీటర్ల టీ47 ఈవెంట్‌లో గావిట్ స్వర్ణ పతకం సాధించాడు. అతను 49.48 సెకన్ల అద్భుతమైన రన్ టైమ్‌తో ప్రతిష్టాత్మక స్వర్ణం సాధించాడు. మొట్టమొదటిసారిగా భారత పారా కంటెంజెంట్ 100 పతకాలకు పైగా గెలుచుకున్నారు. ప్రస్తుతం జరుగుతున్న 4వ ఆసియా పారా గేమ్స్‌లో ఈ ఘనత సాధించడం విశేషం.

Also Read :  Hamas Air Chief : గాజాపై ఇజ్రాయెల్ ఫైటర్ జెట్‌ల దాడి…హమాస్ ఎయిర్ చీఫ్ అబూ రకాబా హతం

జకార్తాలో జరిగిన 2018 పారా గేమ్స్‌లో దేశానికి ఇంతకుముందు అత్యధిక పతకాలు వచ్చాయి. అప్పట్లో 15 స్వర్ణాలు, 24 రజతాలు, 33 కాంస్యాలతో సహా 72 పతకాలు సాధించారు. ఈ విజయాలు అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ప్రతిష్టాత్మక క్రీడల చివరి రోజైన శనివారం పీఆర్‌3 మిక్స్‌డ్ డబుల్స్ స్కల్స్‌లో రోవర్లు అనిత, నారాయణ కొంగనపల్లె రజత పతకాన్ని కైవసం చేసుకోవడంతో భారత్‌కు పతకాల సందడి కొనసాగింది.