India vs New Zealand: ఇండియా-న్యూజిలాండ్ జట్ల మధ్య బుధవారం తొలి వన్డే జరగబోతుంది. ఈ మ్యాచ్‌కు హైదరాబాద్, ఉప్పల్ స్టేడియం వేదిక కానుంది. డే-నైట్ మ్యాచ్ కావడంతో, దీని కోసం హెచ్‌సీఏ (హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్) అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.
Pawan Kalyan: పవన్ కల్యాణ్‌పై పోటీకి సిద్ధం: వైసీపీ నేత, నటుడు అలీ
చాలా కాలం తర్వాత ఇక్కడ ఇంటర్నేషనల్ మ్యాచ్ జరుగుతుండటంతో తగిన ఏర్పాట్లు పూర్తి చేసింది. బుధవారం మధ్యాహ్నం 01.30 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. మ్యాచ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా తగిన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు రాచకొండ సీపీ చౌహాన్ వెల్లడించారు. దాదాపు 2,500 మంది పోలీసులతో భద్రత కల్పిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఈ వివరాల్ని మంగళవారం ఆయన మీడియాకు వెల్లడించారు. చౌహాన్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ మ్యాచ్ నిర్వహణ కోసం 2,500 మంది పోలీసులు భద్రత కల్పిస్తున్నారు. మహిళల కోసం ప్రత్యేకంగా 40 మందితో షీ టీమ్‌లు ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి ప్రేక్షకుల్ని స్టేడియంలోకి అనుమతిస్తారు.
Jharkhand: పిల్లలకు మొబైల్ చోరీలో శిక్షణ ఇస్తున్న ముఠా.. ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులు
సెల్‌ఫోన్ మినహా ఇతర వస్తువుల్ని స్టేడియంలోకి అనుమతించరు. పాసులు, టిక్కెట్లు, బీసీసీఐ అనుమతించిన కార్డులు ఉన్న వాళ్లు మాత్రమే స్టేడియానికి రావాలి. మైదానంలోకి వెళ్లి ఆటగాళ్లను అడ్డుకుంటే కఠిన చర్యలు తీసుకుంటారు. మ్యాచ్‌కు సంబంధించిన టిక్కెట్లను బ్లాక్‌లో అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. బ్లాక్ టిక్కెటింగ్, బెట్టింగ్ జరగకుండా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. బ్లాక్ టిక్కెట్లకు సంబంధించి ఇప్పటికే పలు కేసులు నమోదయ్యాయి. ట్రాఫిక్ సమస్యలు రాకుండా ప్రత్యేక పార్కింగ్ ఏర్పాట్లు చేసినట్లు చౌహాన్ వెల్లడించారు.