Jharkhand: పిల్లలకు మొబైల్ చోరీలో శిక్షణ ఇస్తున్న ముఠా.. ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులు

ఝార్ఖండ్, షాహిబ్‌గంజ్ జిల్లాలోని రాజ్ మహల్, తిన్ పహార్ ప్రాంతాలకు చెందిన పేద మైనర్ పిల్లలను ఈ ముఠా లక్ష్యంగా చేసుకుంటుంది. పేద కుటుంబాలు, ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందిన పిల్లల్ని ఎంపిక చేసి వాళ్లకు మొబైల్స్ చోరీలో కొద్ది రోజులపాటు శిక్షణ ఇస్తారు.

Jharkhand: పిల్లలకు మొబైల్ చోరీలో శిక్షణ ఇస్తున్న ముఠా.. ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులు

Jharkhand: ఏ తల్లిదండ్రులైనా పిల్లల్ని బాగా చదివించాలి అనుకుంటారు. పిల్లల్ని తమ స్థాయికి తగ్గ స్కూళ్లో చేర్పించి, విద్య నేర్పిస్తుంటారు. కానీ, ఝార్ఖండ్‌లోని రాజ్ మహల్, తిన్ పహార్ ప్రాంతాల్లోని కొందరు తల్లిదండ్రులు మాత్రం తమ పిల్లల్ని స్కూళ్లలో చేర్పించకుండా మొబైల్ చోరీలో శిక్షణ ఇప్పిస్తున్నారు.

Pawan Kalyan: పవన్ కల్యాణ్‌పై పోటీకి సిద్ధం: వైసీపీ నేత, నటుడు అలీ

ప్రత్యేకంగా కొందరు వ్యక్తులు ముఠాగా ఏర్పడి, పిల్లలకు మొబైల్స్ చోరీలో శిక్షణ కూడా ఇస్తున్నారు. ఈ ముఠాను తాజాగా రాంచీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఝార్ఖండ్, షాహిబ్‌గంజ్ జిల్లాలోని రాజ్ మహల్, తిన్ పహార్ ప్రాంతాలకు చెందిన పేద మైనర్ పిల్లలను ఈ ముఠా లక్ష్యంగా చేసుకుంటుంది. పేద కుటుంబాలు, ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందిన పిల్లల్ని ఎంపిక చేసి వాళ్లకు మొబైల్స్ చోరీలో కొద్ది రోజులపాటు శిక్షణ ఇస్తారు. మొబైల్స్ ఏ ప్రాంతంలో చోరీ చేయాలి.. ఎవరిని లక్ష్యంగా చేసుకోవాలి.. తర్వాత వాటిని రహస్యంగా ఎలా చేరవేయాలి వంటివన్నీ ఈ శిక్షణలో నేర్పిస్తారు. శిక్షణ పూర్తైన వారిని ఈ ప్రాంతం నుంచి రాంచీ పట్టణానికి తీసుకెళ్తారు.

Chandigarh: ఒక్క ఓటు తేడాతో మేయర్ సీటు దక్కించుకున్న బీజేపీ.. చండీగఢ్ మేయర్‌గా అనూప్ గుప్తా

అక్కడ కూరగాయల మార్కెట్లు, ఇతర మార్కెట్లు, రద్దీగా ఉండే ప్రదేశాల్లో వీళ్లు మొబైల్స్ చోరీకి పాల్పడుతుంటారు. ముందుగా పిల్లలు మొబైల్స్ చోరీ చేస్తారు. వెంటనే వాటిని దగ్గర్లోనే ఉన్న తమ గ్యాంగ్‌లోని సీనియర్లకు అప్పగిస్తారు. వాళ్లు వెంటనే తమ ప్రదేశానికి మొబైల్స్ తీసుకెళ్తారు. ఒకరు మొబైల్ కొట్టేసి, ఇంకొకరికి ఇవ్వడం వల్ల అంత త్వరగా దొరకరు. ఇలా కొట్టేసిన మొబైల్స్‌ను మార్చేసి, బంగ్లాదేశ్ తరలిస్తారు. కొట్టేసిన ప్రతి మొబైల్‌పై బ్రాండ్‌ను బట్టి రూ.వెయ్యి నుంచి రెండు వేల రూపాయల వరకు ఇస్తారు. ప్రతి ఒక్కరూ రోజుకు 8-10 మొబైల్స్ అయినా కొట్టేయాలి. ఇలా మొబైల్ చోరీ చేస్తున్న నలుగురు మైనర్లను పోలీసులు తాజాగా పట్టుకున్నారు. వారిని విచారించగా ఈ ముఠా విషయం బయటపడింది.

JP Nadda: బీజేపీ అధ్యక్షుడిగా జేపీ నద్దా పదవీ కాలం పొడిగింపు.. 2024 లోక్‌సభ ఎన్నికలు నద్దా నాయకత్వంలోనే

పోలీసులు దీనితో సంబంధం ఉన్న వాళ్లను అదుపులోకి తీసుకున్నారు. వాళ్ల దగ్గరి నుంచి 43 మొబైళ్లను స్వాధీనం చేసుకున్నారు. కాగా, పోలీసులు పట్టుకున్న నలుగురు మైనర్లలో ఒకరి వయసు 11 కాగా, మరొకడి వయసు 17. ఇద్దరూ గతంలో కూడా దొరికిపోయి జువైనల్ హోంలో శిక్ష అనుభవించిన వారే. అయినప్పటికీ, తమ పంథా మార్చుకోకుండా తిరిగి మొబైల్స్ చోరీ చేస్తూనే ఉన్నారు. మైనర్లు మొబైల్స్ చోరీ చేసేందుకు వాళ్ల తల్లిదండ్రులు కూడా అంగీకరించడం విశేషం. తల్లిదండ్రుల అనుమతితోనే పిల్లలు మొబైల్స్ చోరీ చేస్తున్నారు.